Vande Bharat: ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ మరో శుభవార్త చెప్పింది. హైదరాబాద్ కాచిగూడ నుంచి బెంగళూరు యశ్వంత్‌పూర్ వరకు నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇకపై హిందూపురం రైల్వే స్టేషన్లోనూ ఆగనుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Vande Bharat: హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి పలుమార్లు రైల్వే మంత్రిని కలసి ఈ విషయంపై విజ్ఞప్తి చేశారు. ప్రయాణికుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కాచిగూడ-యశ్వంత్‌పూర్ వందేభారత్ ట్రైన్‌ను హిందూపురంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించి నిలుపుదలకు అంగీకరించారు.
ఇది కూడా చదవండి: AP Lawyer: మీరు గ్రేట్ సార్.. ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా లాయర్ నిశ్శబ్ద ఉద్యమం
హిందూపురం స్టేషన్లో వందేభారత్ నిలుపుదలకి సంబంధించిన ఆర్డర్ కాపీని ఎంపీ పార్థసారథి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి వద్ద అనేకసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించానని, చివరికి అధికారుల అనుమతి లభించిందని ఆయన తెలిపారు.
రైల్వే అధికారులు తొలుత ప్రయోగాత్మకంగా హిందూపురం స్టేషన్లో వందేభారత్ ట్రైన్‌ను నిలిపే నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ట్రైన్ నిలుపుదల ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందన్న వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు.
