AP Mega DSC: ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డీఎస్సీ 2025 నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఇప్పటికే ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు కూడా అందజేశారు. అయితే, ఇప్పుడు ఈ కొత్త టీచర్లకు శిక్షణ విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయి.
AP Mega DSC: విద్యాశాఖ ఆదేశాల ప్రకారం ఎంపికైన ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి 10 వరకు శిక్షణ నిర్వహించనున్నారు. అక్టోబర్ 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ కూడా జరగనుంది. కౌన్సెలింగ్ అనంతరం కొత్త టీచర్లకు అకడమిక్ క్యాలెండర్, హ్యాండ్బుక్ వంటి మెటీరియల్ను అందించనున్నారు. అనంతరం, మరో విడత శిక్షణ ఏప్రిల్ 25 నుంచి మే 5 వరకు ఉండనుందని విద్యాశాఖ ప్రకటించింది.
ఇది కూడా చదవండి: Viral Video: థాయిలాండ్లో వింత మార్కెట్.. ఏకంగా మొసళ్ళతోనే.. నెటిజన్లు షాక్!
ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ డీఎస్సీ టీచర్ పోస్టుల్లో ఎంపికైన అభ్యర్థులు శిక్షణకు హాజరుకావడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ప్రస్తుత విభాగాలు సెలవులు మంజూరు చేయడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, విద్యాశాఖ మాత్రం “శిక్షణకు తప్పనిసరిగా హాజరు కావాలి” అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచే ప్రస్తుత విధుల నుంచి రిలీవ్ చేస్తామని ఆయా విభాగాలు చెబుతున్నా, శిక్షణ ముందు రిలీవ్ చేయడం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. దీంతో ఎంపికైన టీచర్లు రెండు వైపుల ఒత్తిడికి గురవుతున్నారు.
మొత్తానికి, మెగా డీఎస్సీ 2025 టీచర్లు నియామక పత్రాలు అందుకున్న ఆనందంలో ఉన్నా, శిక్షణ హాజరు విషయంలో చిక్కుల్లో పడుతున్నారు.
