Ganja Transport: పుష్ప రేంజ్ లో ప్లాన్ చేసారు కానీ చివర్లో దొరికేసారు!

Ganja Transport: హైవేపై దూసుకెళ్తున్న డీసీఎం వాహనాన్ని పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. కట్ చేస్తే అందులో కనిపించింది రెండు కోట్ల విలువైన గంజాయి! ఈ సంఘటన విజయవాడ రామవరప్పాడులో చోటుచేసుకుంది.

Ganja Transport: డీఆర్‌ఐ (DRI) అధికారులకు పక్కా సమాచారం రావడంతో ఆ వాహనాన్ని చెక్ చేశారు. ఛత్తీస్గఢ్ సుక్మా నుంచి తమిళనాడులోని సేలంకు తరలిస్తున్న 1,300 కిలోల గంజాయి (సుమారు రూ.2.5 కోట్లు విలువ)ని స్వాధీనం చేసుకున్నారు.

అక్రమార్కులు గంజాయి ప్యాకెట్లను పైపులు, ఇతర సామగ్రి మధ్యలో దాచిపెట్టి తరలిస్తున్నారు. మొత్తం 561 ప్యాకెట్లు వాహనంలో దొరికాయి. ఎవరికీ అనుమానం రాకుండా గూడ్స్ వాహనంగా మారుస్తూ మూడు రాష్ట్రాల సరిహద్దులు దాటించే ప్రయత్నం చేశారు.

ఈ కేసులో వెంకటేష్, మురుగేషన్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని రిమాండ్‌కు తరలించారు.

మొత్తానికి, ఎన్ని కట్టడి చర్యలు తీసుకున్నా, గంజాయి మాఫియా కొత్త మార్గాలు వెతుక్కుంటూనే ఉంది. కానీ అప్రమత్తమైన పోలీసుల చేతికి చివరకు బలయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *