Manisha Koirala: సినీ ఇండస్ట్రీలో ఎఫైర్లు, డేటింగ్లు అనేవి సర్వసాధారణం. ఈ హీరోయిన్ కూడా అంతే. తన 30 ఏళ్ల సినీ కెరీర్లో చాలామందితో డేటింగ్ చేసింది. చివరికి పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు తీసుకుంది. మరి ఆమె ఎవరో తెలుసా.?
Manisha Koirala: ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మనీషా కోయిరాలా. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అగ్రనటులతో కలిసి నటించిన ఈ బ్యూటీ.. అందం, నటనతో ఎంతోమంది అభిమానులను సంపాదించింది. కానీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం ఓ చేదు జ్ఞాపకం.
1991లో సౌదాగర్ సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మనీషా, కొద్దికాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించింది. దాదాపు 30 ఏళ్ల కెరీర్లో 70కిపైగా చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమె నటించిన బాంబే, భారతీయుడు, ఒకే ఒక్కడు సినిమాలు సూపర్హిట్ అయ్యాయి.
అయితే కెరీర్లో స్టార్ ఇమేజ్ సంపాదించినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మనీషా ఎన్నో కష్టాలను ఎదుర్కొంది. నానా పటేకర్, వివేక్ ముశ్రన్, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ వంటి వారితో సహా ఏకంగా 12 మంది వ్యక్తులతో ఆమెకు ఎఫైర్స్ ఉన్నాయని బాలీవుడ్ టాక్.
కానీ వీరిలో ఎవ్వరినీ పెళ్లి చేసుకోని మనీషా.. చివరికి 2010లో వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ ను పెళ్లి చేసుకుంది. అయితే వివాహ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం 2 ఏళ్లకే ఇద్దరూ విడిపోయారు.
ప్రస్తుతం 53 ఏళ్ల వయస్సులో ఒంటరిగా జీవిస్తున్న మనీషా కోయిరాలా.. ఇటీవలే క్యాన్సర్ బారి నుంచి బయటపడింది. జీవితంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ, ఆమె ఇంకా బలంగా నిలబడటమే ప్రత్యేకత అని చెప్పవచ్చు.
View this post on Instagram
