Uco Bank Officer: బ్యాంకుల్లో సీనియర్ అధికారుల ప్రవర్తనపై అప్పుడప్పుడూ ఆరోపణలు వస్తూనే ఉంటాయి. తాజాగా, యూకో బ్యాంక్ చెన్నై జోనల్ హెడ్ ఆర్.ఎస్. అజిత్ ప్రవర్తనకు సంబంధించిన ఒక ఇమెయిల్ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన తల్లి మరణించడంతో సెలవు అడిగిన ఉద్యోగికి ఆయన ఇచ్చిన సమాధానం ప్రజల్లో ఆగ్రహం రేపింది.
Uco Bank Officer: వైరల్ అయిన ఇమెయిల్ ప్రకారం, ఒక ఉద్యోగి తల్లి మరణించడంతో అత్యవసరంగా సెలవు కోరాడు. అయితే సీనియర్ అధికారి “ప్రతి ఒక్కరి తల్లి చనిపోతుంది. నటించడం మానేయండి, వెంటనే విధుల్లో చేరండి. లేకపోతే LWP (Leave Without Pay)గా మార్క్ చేస్తాను” అని సమాధానమిచ్చారని ఆరోపణలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Quetta Blast: క్వెట్టా నగరంలో భయానక ఘటన.. ఎనిమిది మంది మృతి – పదుల సంఖ్యలో గాయాలు!
మరిన్ని షాకింగ్ ఆరోపణలు ఒక ఉద్యోగి తల్లి ఐసీయూలో ఉన్నప్పటికీ, “ఎప్పుడెప్పుడు తిరిగి వస్తావో చెప్పు” అని ఒత్తిడి చేశారట. ఒక అధికారి ఏడాది వయసున్న కుమార్తె ఆసుపత్రిలో చేరినా సెలవు నిరాకరించారట. మరొక ఉద్యోగి భార్యకు అత్యవసర పరిస్థితి వచ్చినప్పటికీ సెలవు అడగడంతో అవమానించారని పత్రికలో పేర్కొన్నారు.
సీనియర్ మేనేజర్ తన కింద పని చేసే వారిని సహోద్యోగులుగా కాకుండా లోబడి ఉన్న వారిలా చూస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. దినదినం భయంతో, వేధింపులతో పనిచేయాల్సి వస్తోందని చెప్పారు.
ఈ మెయిల్ స్క్రీన్షాట్ను ఒక ఉద్యోగి RBIకి ట్యాగ్ చేసి షేర్ చేయడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ఇలాంటి అధికారి వెంటనే సస్పెండ్ చేయాలి” అని కామెంట్లు వస్తున్నాయి. “క్రమశిక్షణ పేరుతో క్రూరత్వం సహించరాని విషయం” అంటూ ఖండిస్తున్నారు.
ప్రస్తుతం యూకో బ్యాంక్ లేదా చెన్నై జోనల్ ఆఫీస్ ఈ ఆరోపణలపై ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ ఈ వ్యవహారం ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, RBI దృష్టికి వెళ్లడంతో త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంచనా.
Mother died? — ‘Everyone’s mother dies, don’t be dramatic.’
Child in ICU? –‘Are you a doctor? Go to office or LWP.’
Wife hospitalized? –‘You are useless.’,
This is how @UCOBank’s Zonal Head treats his own officers. Not leadership, but barbaric dictatorship. Shame on this… pic.twitter.com/U0TwJIASqX
— Venkatesh Alla (@venkat_fin9) September 28, 2025
