Shruti Sodhi: నందమూరి, మెగా హీరోలతో ఆడిపాడింది.. నటనకు గుడ్ బై చెప్పి!

Shruti Sodhi: సినిమా రంగం అంటే ఒక కలల ప్రపంచం. ఈ రంగంలో చాలా మంది ముద్దుగుమ్మలు అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కొందరు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందుతుంటే, మరికొందరు మాత్రం కొద్ది కాలంలోనే వెనక్కి తగ్గిపోతారు. అలాంటి వారిలో ఒకరు శృతి సోధి.

Shruti Sodhi: ఢిల్లీకి చెందిన శృతి సోధి ఇంటర్మీడియెట్ వరకు సైన్స్ చదివినా, డిగ్రీలో ఫిలాసఫీ ఆర్ట్స్ తీసుకుంది. చదువు పూర్తి చేసిన తర్వాత యాంకర్‌గా కెరీర్ ప్రారంభించింది. న్యూస్ ఎక్స్ సహా పలు ఛానెల్స్‌లో న్యూస్ & స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా పనిచేసింది. అదే సమయంలో పంజాబీ సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

తెలుగు ఆడియెన్స్‌కు శృతి సోధి పేరు పరిచయం అయిన సినిమా పటాస్. నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించి, ప్రత్యేకంగా ‘అరే ఓ సాంబ’ రీమిక్స్ పాటలో తన స్టెప్పులతో ఆకట్టుకుంది. ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సుప్రీమ్ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. అలాగే నవీన్ చంద్ర హీరోగా వచ్చిన మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలో ప్రియ పాత్రలో నటించింది. ఇదే ఆమె చివరి తెలుగు సినిమా.

కొంత కాలం నటనలో అవకాశాలు దొరకకపోవడంతో శృతి సోధి మళ్లీ తన మొదటి కెరీర్‌ అయిన యాంకరింగ్ వైపు మళ్లింది. ప్రస్తుతం ఆమె స్పోర్ట్స్ ప్రజెంటర్‌గా రాణిస్తోంది. పలు క్రీడా ఈవెంట్స్‌లో ఆమె ఆతిథ్యమిస్తుంటుంది.

సినిమాలకు దూరమైనా, శృతి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనే దాదాపు 9 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉంటుంది.

 

View this post on Instagram

 

A post shared by Shruti Sodhi (@aslishrutisodhi)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *