Viral Video: రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఒక ప్రత్యేకమైన పెళ్లి వేడుక జరిగింది. ఈ వివాహం సామాన్యమైనది కాదు, ఎందుకంటే వధువుకి వయసు 27 ఏళ్లు కాగా, వరుడి వయసు 72 ఏళ్లు. అంతేకాక, ఈ జంట భారతీయులు కాదు.. ఉక్రెయిన్‌కు చెందినవారు. అయినప్పటికీ భారతీయ ఆచారాలను ఇష్టపడి, హిందూ వేద సంప్రదాయంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు.
Viral Video: 72 ఏళ్ల వరుడు స్టానిస్లావ్, రాజవంశపు షేర్వాణీ, కాషాయ పాగా, రత్నాల చిహ్నం ధరించి గుర్రంపై పెళ్లి వేడుకకు హాజరయ్యాడు. 27 ఏళ్ల వధువు అన్హెలినా సాంప్రదాయ హిందూ పెళ్లి కూతురిలా అలంకరించబడింది. వివాహం జోధ్‌పూర్‌లోని అందమైన ఖాస్ బాగ్‌లో జరిగింది. నుదుట తిలకం పెట్టి స్వాగతం చెప్పడంతో వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఇది కూడా చదవండి: Viral Video: కారు సీట్ బెల్ట్‌తో ఇంటి తలుపుకు తాళం.. జుగాద్ టాలెంట్ చూసి షాక్ అయిన నెటిజన్లు!
ఉక్రెయిన్‌కు చెందిన ఈ జంట ఇప్పటికే మూడు-నాలుగు సంవత్సరాలు సహజీవనం చేశారు. భారతీయ సంస్కృతిని దగ్గరగా చూసిన తర్వాత బాగా ఇష్టపడి, తమ పెళ్లిని సంపూర్ణ భారతీయ సంప్రదాయంలో జరపాలని నిర్ణయించారు. అందుకే చారిత్రక రాజరిక వాతావరణం ఉన్న జోధ్‌పూర్‌ను వివాహ వేదికగా ఎంచుకున్నారు.
పెళ్లి వేడుకలో ఈ జంట సప్తపది, దండల మార్పిడి, సంప్రదాయ మంత్రోచ్చారణలు సహా అన్ని ఆచారాలను పాటించారు. వివాహ నిర్వాహకులు రోహిత్, దీపక్ మాట్లాడుతూ – “వధువు అన్హెలినా భారతీయ ఆచారాలకు బాగా ప్రభావితమై, ప్రతి రీతిని నిజాయితీగా చేయాలని కోరుకున్నారు” అని వెల్లడించారు.
ఈ రాజరిక పెళ్లి రెండు విభిన్న సంస్కృతుల కలయికగా నిలిచి, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జోధ్‌పూర్ అందమైన ప్రదేశాలు, రాజరిక చరిత్ర ఈ వివాహానికి మరింత ప్రత్యేకతను చేకూర్చాయి.
View this post on Instagram
