Traffic Challans: దేశవ్యాప్తంగా పెండింగ్ చలాన్లు లక్ష కోట్ల దాటే పరిస్థితి.. తెలుగు రాష్ట్రాల లెక్కలు షాక్!

Traffic Challans: దేశవ్యాప్తంగా ట్రాఫిక్‌ చలాన్లు రోజురోజుకూ పేరుకుపోతున్నాయి. వాహనదారులు చెల్లించకుండా వదిలేసే ఈ పెండింగ్‌ ఫైన్ల మొత్తం ఇప్పుడు ప్రభుత్వం బకాయిల రూపంలో 97 వేల 921 కోట్లు చేరింది. ఇది 2023 వరకూ ఉన్న లెక్క మాత్రమే. గత ఏడాదిలోనే పెండింగ్‌ చలాన్లు 61 శాతం పెరిగాయి. దీంతో ఆ మొత్తాలు లక్ష కోట్ల మార్క్ దాటిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

Traffic Challans: ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై పోలీసులు భారీగా ఫైన్లు విధిస్తున్నా, డ్రైవర్లు వాటిని లైట్‌గా తీసుకోవడంతో వసూళ్లు తక్కువగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కేవలం 40 శాతం చలాన్లే క్లియర్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఈ శాతం 14% మాత్రమే ఉండటం పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది.

ఇది కూడా చదవండి: Delhi Police: దేశంలో భారీ ఉగ్రవాద కుట్ర భగ్నం.. ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు, బాంబు సామగ్రి స్వాధీనం!

Traffic Challans: ట్రాఫిక్‌ చలానాల వసూళ్లలో 76 శాతం వసూళ్లతో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉండగా, 69 శాతం వసూళ్లతో మహారాష్ట్ర, హర్యానా రెండో స్థానంలో నిలిచాయి. మరోవైపు 14 శాతం వసూళ్లతో ఢిల్లీ చివరి స్థానంలో ఉండగా, దాని తర్వాత కర్ణాటక 21 శాతంతో నిలిచింది. ఉదాహరణకు, ఢిల్లీలో ఈ ఏడాది ₹4,468 కోట్ల విలువైన చలాన్లు ఇష్యూ అయితే, వసూలైనవి కేవలం ₹645 కోట్లు మాత్రమే. దీంతో పెండింగ్‌ చలాన్ల క్లియరెన్స్ కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Wife Gold Heist: మహానటి.. ప్రియుడి కోసం భర్తనే ఇరికించింది.. పోలీసుల ఎంట్రీతో బయటపడిన బండారం

2025 ఆగస్ట్‌ 31 నాటికి ఏపీలో మొత్తం 48.78 లక్షల చలాన్లు జారీ అయ్యాయి. వీటి విలువ ₹240.32 కోట్లు. అయితే వీటిలో 31.09 లక్షల చలాన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పెండింగ్‌ చలాన్ల విలువే దాదాపు ₹60 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌ మూడు కమిషనరేట్ల పరిధిలో ఈ ఏడాది సుమారు 20 లక్షల చలాన్లు జారీ అయ్యాయి. వీటిలో చాలా చలాన్లు పెండింగ్‌లోనే ఉన్నాయి. అయితే 2023 డిసెంబర్‌ నుంచి 2024 ఫిబ్రవరి వరకూ అమలు చేసిన డిస్కౌంట్ స్కీమ్తో భారీగా పెండింగ్‌ చలాన్లు క్లియర్ అయ్యాయి. ఆ సమయంలో 1.67 కోట్ల చలాన్లు క్లియర్ అవడంతో, ₹150.58 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది.

ఇది కూడా చదవండి: PM Modi: మా భారతి సేవలో మోహన్ జీ.. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 75వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీ ప్రత్యేక వ్యాసం

ఫైన్ రేట్లలో తేడా

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ట్రాఫిక్ చలాన్లలో వేర్వేరు విధానాలు పాటిస్తున్నాయి. ఉదాహరణకు:

  • హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే ఏపీలో ₹1,000 ఫైన్, తెలంగాణలో మాత్రం ₹200 ఫైన్.

  • డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడితే ఏపీలో ₹5,000 ఫైన్, తెలంగాణలో ₹1,000 ఫైన్.

రెండు రాష్ట్రాల్లో కూడా చలాన్లు జారీ చేసేందుకు సీసీ కెమెరాలు, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. మొత్తానికి, పెండింగ్‌ చలాన్లు రోజురోజుకూ పెరిగిపోతూ లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటబోతున్నాయి. ఇక డ్రైవర్లు ఫైన్‌లను సీరియస్‌గా తీసుకోకపోతే, వాహనదారులపై మరింత కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *