Kidney for Iphone: ఒక తప్పు నిర్ణయం జీవితాన్ని ఎలా మార్చేస్తుందో చైనా వ్యక్తి వాంగ్ షాంగ్కున్ కథ అందరికీ మేలుకోలుపుగా మారింది. కేవలం 17 ఏళ్ల వయసులో వాంగ్ తన కిడ్నీని అక్రమ మార్కెట్లో అమ్ముకుని లేటెస్ట్ ఐఫోన్ 4 మరియు ఐప్యాడ్ 2 కొనుగోలు చేశాడు.
Kidney for Iphone: 2011లో వాంగ్ ఒక కిడ్నీని 20,000 యువాన్లకు (సుమారు ₹2.5 లక్షలు) విక్రయించాడు. తాను పేద కుటుంబానికి చెందినవాడని, రెండు కిడ్నీల్లో ఒకటి సరిపోతుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాడు. హునాన్ ప్రావిన్స్లోని చిన్న పట్టణంలో స్థానిక ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కానీ సర్జరీ తర్వాత సరైన ఆరోగ్య సంరక్షణ లేకపోవడంతో అతని శరీరంలో బ్యాక్టీరియా వ్యాపించింది.
ఇది కూడా చదవండి: High Court: హైకోర్టు కీలక ఆదేశాలు: నాగార్జునకు ఊరట!
కొద్ది నెలల్లోనే వాంగ్ మరో కిడ్నీకి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ప్రస్తుతం 31 ఏళ్ల వయసులో అతను పూర్తిగా వికలాంగుడిగా మారాడు. అతని రెండో కిడ్నీ కూడా ఫెయిల్ అవడంతో జీవితాంతం డయాలసిస్ యంత్రంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వాంగ్ తన కథను సోషల్ మీడియాలో పంచుకుంటూ యువతను హెచ్చరిస్తున్నాడు. తాజా ఐఫోన్ మోడల్స్ ధరల పెరుగుదలతో కొంతమంది యువకులు మళ్లీ అవయవాల అక్రమ రవాణా ముఠాలను సంప్రదిస్తున్నారనే వార్తలు వస్తున్న వేళ, వాంగ్ కథ పాఠంగా మారింది.
“ఒక క్షణిక ఆశ కోసం జీవితాన్ని పణంగా పెట్టొద్దు” అని వాంగ్ స్పష్టం చేస్తున్నాడు. తన తప్పుడు నిర్ణయానికి తాను జీవితాంతం మూల్యం చెల్లిస్తున్నానని చెబుతూ, తన అనుభవం ద్వారా యువతకు అవగాహన పెంచాలని ప్రయత్నిస్తున్నాడు.
ఈ కథ మానవ అవయవాల అక్రమ రవాణా ఎంతటి ప్రమాదకరమో, అలాగే తప్పుడు నిర్ణయాలు జీవితాన్ని శాశ్వతంగా మార్చేస్తాయో స్పష్టంగా తెలియజేస్తోంది.
