Little Hearts Movie Review: నిబ్బా-నిబ్బి లవ్ స్టోరీలో ఎంజాయ్ ఎంత ఉందంటే..!

Little Hearts Movie Review: 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు పొందిన దర్శకుడు ఆదిత్య హసన్ ఇప్పుడు నిర్మాతగా మారి తెరపైకి తీసుకొచ్చిన సినిమా లిటిల్ హార్ట్స్. యూట్యూబర్ మౌళి హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

Little Hearts Movie Review: ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌లో ఫెయిల్ అయిన అఖిల్ (మౌళి) బీటెక్ సీటు కోసం లాంగ్‌టర్మ్ కోచింగ్ సెంటర్‌లో చేరతాడు. అక్కడే **కాత్యాయని (శివాని నాగరం)**ని చూసి ప్రేమలో పడతాడు. ప్రేమను వ్యక్తపరిచిన తర్వాత కాత్యాయని చెప్పిన మాటలు అఖిల్‌ను డైలమాలో పడేస్తాయి. మరోవైపు గోపాలరావు (రాజీవ్ కనకాల) తన కొడుకు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వాలని కలలు కంటాడు. చివరికి అఖిల్ ప్రేమ విజయవంతమైందా లేదా? అనే అంశమే మిగతా కథ.

ఈ సినిమా పూర్తిగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్. ఎక్కడా సీరియస్‌నెస్ లేకుండా ఎపిసోడ్‌ల వారీగా సాగిపోయే కథనం ఆకట్టుకుంటుంది. కామెడీ సన్నివేశాలు, హిలేరియస్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను బాగా ఎంజాయ్ చేయిస్తాయి. ముఖ్యంగా రెండో భాగంలో వచ్చే ఒక పాట ఎపిసోడ్ కడుపుబ్బా నవ్విస్తుంది. మౌళి, రాజీవ్ కనకాల మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రధాన బలం. అలాగే ఎస్ఎస్ కాంచి, మిగతా సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా సినిమాకు లైఫ్ ఇచ్చాయి.

ఇది కూడా చదవండి: Anushka: బాబోయ్.. అనుష్క! ఇదెక్కడి అరాచకం..

నటీనటులు:

  • మౌళి – కామెడీ టైమింగ్ బాగుంది, కానీ కొన్ని చోట్ల ఒకే ఎక్స్ప్రెషన్ ఎక్కువైంది.

  • శివాని నాగరం – పర్ఫెక్ట్‌గా నటించింది.

  • రాజీవ్ కనకాల – తన రోల్‌లో అద్భుతంగా ఒదిగిపోయాడు.

  • హీరో ఫ్రెండ్ క్యారెక్టర్, ఎస్ఎస్ కాంచి పాత్రలు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాయి.

టెక్నికల్ విభాగం:

  • సంగీతం (సింజిత్ యెర్రమల్లి) – ఫ్రెష్‌గా, యూత్‌ఫుల్‌గా ఉంది.

  • సినిమాటోగ్రఫీ (సూర్య బాలాజీ) – విజువల్స్ సినిమాకు సరిపోయాయి.

  • ఎడిటింగ్ (శ్రీధర్ సోంపల్లి) – షార్ప్‌గా ఉంది.

దర్శకుడు సాయి మార్తాండ్ – యూత్ కోసం సరదాగా ఎంజాయ్ చేసే లవ్ స్టోరీని సక్సెస్‌ఫుల్‌గా డెలివర్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *