Ram Gopal Varma: మీరు మారరా?.. టీచర్స్‌డేపై రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ ట్వీట్.. భగ్గుమన్న నెటిజన్లు

Ram Gopal Varma: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. గతంలో తన సినిమాలతో సంచలనాలు సృష్టించిన వర్మ, ఇప్పుడు తరచూ కాంట్రవర్సీ ట్వీట్లు, కామెంట్లతోనే వార్తల్లో నిలుస్తున్నారు.

Ram Gopal Varma: టీచర్స్ డే నాడు వర్మ తన జీవితానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల జాబితాను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “నా దర్శక జీవితానికి ప్రేరణగా నిలిచిన అమితాబ్ బచ్చన్, స్టీవెన్ స్పీల్‌బర్గ్, అయాన్ రాండ్, బ్రూస్ లీ, శ్రీదేవి, దావూద్ ఇబ్రహీంలకు టీచర్స్ డే శుభాకాంక్షలు” అంటూ రాసుకొచ్చారు.

అయితే ఈ జాబితాలో దావూద్ ఇబ్రహీం పేరును చేర్చడం వివాదాస్పదంగా మారింది. అంతర్జాతీయ ఉగ్రవాది, భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ నేరస్థుడిని ‘గురువు’గా పేర్కొనడమేంటని నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఇలాంటి పోస్ట్ చేయడం దారుణమని విమర్శిస్తున్నారు.

“దావూద్ ఇబ్రహీంను గర్వంగా ప్రస్తావించడం సిగ్గుచేటు. ఇది టీచర్స్ డే.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవమానం” అంటూ అనేక మంది వర్మపై మండిపడుతున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారి పెద్ద చర్చకు దారితీసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *