Viral Video: సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక అడవి పంది.. క్రూరమైన వేటగాడిగా పేరొందిన చిరుత పులిని తిప్పికొడుతున్న దృశ్యం కనిపిస్తుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ తన ఎక్స్ అకౌంట్లో ఈ వీడియోను షేర్ చేయడంతో నెట్టింట్లో పెద్ద చర్చకు దారితీసింది.
Viral Video: అడవిలో చిరుతలు, సింహాలు, పులులు అత్యంత ప్రమాదకరమైన వేటగాళ్లుగా పరిగణించబడతాయి. వీటి గర్జనకే పెద్ద జంతువులు కూడా వెనక్కి తగ్గుతాయి. అయితే ఈ వైరల్ వీడియో మాత్రం ఆ సత్యానికి భిన్నంగా ఉంది. ఇందులో ఓ లావుగా ఉన్న అడవి పంది, పొదల మధ్య కూర్చున్న చిరుత దగ్గరకు చేరుతుంది. మొదట చిరుత తన స్థానంలోనే ఉండిపోతుంది కానీ పంది అకస్మాత్తుగా దాడి చేయడానికి ప్రయత్నించగానే చిరుత ఒక్కసారిగా భయపడి పరుగులు తీయడం వీడియోలో కనిపిస్తుంది.
ఇది కూడా చదవండి: Inspiring Teacher Story: పట్టుదలతో చేతుల్లేని ఉపాధ్యాయుడు… గుల్షన్ లోహర్ కథ ప్రతి యువతకు స్ఫూర్తి
ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. “ఇదే కదా కలికాలం.. చిరుత పులి అడవి పందికి భయపడుతుందా!” అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం అడవి పందుల అసలైన శక్తిని గుర్తుచేస్తున్నారు. “అడవి పందులు చాలా బలమైనవి. వాటి దంతాలు, నుదురు ప్రాణాంతకమైనవి. సింహాలు కూడా వాటి నుండి దూరంగా ఉంటాయి” అంటూ స్పందిస్తున్నారు.
అడవిలో జంతువుల మధ్య జరిగే ఈ విభిన్న దృశ్యం ఇప్పుడు నెట్టింట్లో హాట్ టాపిక్గా మారింది.
This leopard just forgot what he is !! Chased away by a wild boar.
You never know what you may witness in wild. pic.twitter.com/J08vnAZkF3
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) September 6, 2025
