Manchu Manoj: హీరోలు తమ అభిమానులను ఎంతగా ప్రేమిస్తారో మళ్లీ ఒకసారి రుజువైంది. అభిమానులు కష్టాల్లో ఉంటే వారికి అండగా నిలవడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా అలాంటి ఘటన ఏలూరులో చోటు చేసుకుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ కరస్పాండెంట్ సోమేశ్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
Manchu Manoj: ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సోమేశ్, తన పరిస్థితిని సోషల్ మీడియాలో పంచుకున్నారు. “నా ఆరోగ్యం బాగా క్షీణించింది. డబ్బు అంతా అయిపోయింది. ఒకానొక సమయంలో ఆత్మహత్య గురించి కూడా ఆలోచించాను. కానీ నా పిల్లల కోసం, కుటుంబం కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నాకు సుమారు రూ. 2 లక్షల వరకు అవసరం ఉంది. ఒక్క రూపాయి సాయం చేసినా అది నా జీవితానికి పెద్ద సహాయం అవుతుంది” అంటూ ఒక భావోద్వేగ పోస్టు చేశారు.
సోమేశ్ పోస్టు చూసిన అభిమానులు, సాధ్యమైనంత మేరకు సాయం చేస్తూ స్క్రీన్షాట్లు షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంలో హీరోలు కూడా ముందుకు వచ్చారు. మంచు మనోజ్ స్పందిస్తూ, “ధైర్యంగా ఉండు తమ్ముడు. మేమంతా నీతో ఉన్నాం. నీ నంబర్ పంపించు” అని ట్వీట్ చేశారు. ఆ వెంటనే సోమేశ్, తన నంబర్ను షేర్ చేశారు.
Send me ur number Thammudu. Stay strong, we r with u. Love u
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) September 7, 2025
ఇక బెల్లంకొండ శ్రీనివాస్ కూడా స్పందిస్తూ, “హలో బ్రదర్, నేను రేపు విజయవాడకు వస్తున్నా. నిన్ను కలసి నాకు సాధ్యమైనంత వరకు సాయం చేస్తా” అని హామీ ఇచ్చారు.
Hello brother, I am coming to Vijayawada tomorrow for promotional things. I will meet you and extend my full support to you, whatever is possible. https://t.co/9PaSMira0o
— Bellamkonda Sreenivas (@BSaiSreenivas) September 6, 2025
హీరోల ఈ స్పందన అభిమానుల మనసులను గెలుచుకుంది. “హీరోయిజం అనేది కేవలం సినిమాల్లో కాదు, ఇలాంటి సమయంలో చూపించేదే నిజమైన హీరోయిజం” అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
