Kangana Ranaut: సినీరంగంలో ఆమె నిజమైన ఫైర్ బ్రాండ్. 15 ఏళ్ల వయసులోనే ఇంటి నుంచి పారిపోయి ముంబై చేరుకున్న ఆమె, ఎన్నో కష్టాలు ఎదుర్కొని నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది. తక్కువ సమయంలోనే అగ్ర కథానాయికగా వెలుగొందిన ఈ బీటౌన్ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు – కంగనా రనౌత్.
Kangana Ranaut: చిన్ననాటి నుంచి సినిమాల్లో నటించాలన్న కల కలగన కంగనాకు, కుటుంబం పెద్దగా అంగీకరించలేదు. దీంతో చదువు మధ్యలోనే మానేసి ముంబైకి ఒంటరిగా వెళ్లింది. మొదట్లో జీవనానికి తిండి దొరకక ఫ్లాట్ఫామ్లపై నిద్రించాల్సిన పరిస్థితి వచ్చింది. చిన్న పనులు చేస్తూ బతుకుదెరువు కోసం కష్టపడింది.
ఇది కూడా చదవండి: Viral Video: ప్రీ-వెడ్డింగ్ షూట్ చేద్దామనుకున్నారు.. కట్ చేస్తే ఊహించని షాక్!
అయితే పట్టుదలతో తన కలను నిజం చేసుకుంది. కేవలం 19 ఏళ్లకే అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్స్టర్ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం ద్వారా ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. అనంతరం ఫ్యాషన్ సినిమాతో జాతీయ అవార్డును అందుకొని ఇండస్ట్రీలో తన స్థానాన్ని బలపరచుకుంది.
తర్వాత క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక వంటి చిత్రాలతో స్టార్డమ్ను అందుకుంది. తెలుగులో కూడా ప్రభాస్ సరసన ఏక్ నిరంజన్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా తను వెడ్స్ మను రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తొలి హీరోయిన్ సెంట్రిక్ సినిమాగా నిలిచింది.
అయితే ముక్కుసూటిగా మాట్లాడే తన తత్వం వల్ల ఆమెకు బాలీవుడ్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. ఇండస్ట్రీలో నెపోటిజంపై బహిరంగంగా విమర్శలు చేయడంతో కొంతమంది పెద్దలు ఆమెను దూరం పెట్టారు. అయినప్పటికీ ఆమె వెనక్కి తగ్గకుండా స్వయంగా నిర్మాతగా మారి సినిమాలు తీశారు.
ఇప్పుడామె రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. బీజేపీ తరపున హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయం సాధించింది. కంగనా రనౌత్ చిన్ననాటి కష్టాలనుంచి నేటి స్టార్డమ్, రాజకీయ ప్రస్థానం వరకు చేసిన ప్రయాణం నిజంగా ప్రేరణాత్మకం.
View this post on Instagram
