Peddi Movie: పెద్ది మూవీ క్రేజీ అప్డేట్: రామ్ చరణ్ తల్లిగా ఆ స్టార్ నటి!

Peddi Movie: ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ హోదా సంపాదించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టాలీవుడ్‌లో మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.

Peddi Movie: ఈ సినిమాను వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ రివెంజ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఇటీవల కర్ణాటకలోని మైసూరులో వెయ్యి మందికి పైగా డ్యాన్సర్లతో ఒక భారీ సాంగ్‌ను జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చిత్రీకరించారు. ఆ పాట సినిమాకు హైలైట్ కానుందని టాక్ వినిపిస్తోంది.

ఇక ఈ దసరా కానుకగా ఒక మ్యూజికల్ సింగిల్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ ఆల్బమ్‌లోని పాటను ఇప్పటికే రామ్ చరణ్ విన్నారని, అదిరిపోయిందని మెచ్చుకున్నట్టుగా సమాచారం.

అయితే, తాజాగా ఈ మూవీలో రామ్ చరణ్ తల్లి పాత్రలో సీనియర్ నటి విజి చంద్రశేఖర్ కనిపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ పాత్రతోపాటు ఆయన తల్లి పాత్ర కూడా కీలకంగా ఉండబోతోందని, అందుకే ఈ పాత్ర కోసం అనుభవజ్ఞురాలైన నటి విజి చంద్రశేఖర్‌ను ఎంపిక చేశారని టాక్.

విజి చంద్రశేఖర్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. గతంలో అఖండ సినిమాలో బాలకృష్ణ తల్లిగా నటించారు. ఆమె తమిళం, కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించారు. 1981లో రజినీకాంత్ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె, సీనియర్ నటి సరిత సోదరి అన్న విషయం ప్రత్యేకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *