AP – TS Police: ఏపీలో ఓ దొంగ కోళ్ల కేసు రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వర్సెస్ పోలీసులుగా మారిన ఈ ఘటన ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
AP – TS Police: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం పట్టాయిగూడెంలో నివసించే రంగనాథ్ అనే వ్యక్తి నాలుగు పందెం కోళ్లు 10 రోజుల క్రితం దొంగలించారు. వీటి విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలంటూ ఆయన స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Hyderabad: హైదరాబాద్లో ఏసీబీ స్పెషల్ ఆపరేషన్.. 18 బృందాలతో అధికారుల ఇళ్లపై సోదాలు!
కొన్ని రోజుల తర్వాత బాధితుడు, తన కోళ్లు తెలంగాణ భద్రాద్రి జిల్లా దమ్మపేటలో ఉన్నాయని సమాచారం అందించాడు. దీంతో ఏపీకి చెందిన చింతలపూడి పోలీసులు నేరుగా దమ్మపేటకు చేరుకుని, శేషగిరి అనే వ్యక్తి ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఆయన భార్యను నిలదీశారు. గేట్లు మూసివేసి, సీసీ కెమెరాలు పగలగొట్టి, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. చివరికి రెండు కోళ్లు కూడా తీసుకెళ్లారు.
ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి, దమ్మపేట పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్కి చేరుకున్న తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసులను స్టేషన్కు తరలించారు. ఇంట్లోకి అక్రమంగా చొరబడి వస్తువులు ధ్వంసం చేశారని శేషగిరి భార్య పిర్యాదు చేసింది.
తర్వాత ఏపీ చింతలపూడి పీఎస్ ఉన్నతాధికారులు దమ్మపేటకు వచ్చి తమ పోలీసులను విడిపించుకుని వెళ్లారు. దీంతో దొంగ కోళ్ల పంచాయితీ చివరికి రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య ఘర్షణగా మారింది.
