Odisha: ఒడిశాలోని అంగుల్ జిల్లాలో చోటుచేసుకున్న ఒక హృదయ విదారక సంఘటన అందరినీ కలచివేసింది. శ్యామ్సుందర్పూర్ గ్రామంలో 11 ఏళ్ల బాలిక మృతదేహం ఒక కాలువలో గుర్తించారు. బాలిక నగ్నంగా ఉండటంతో పాటు శరీరంపై లోతైన గాయాలు ఉండటాన్ని చూసి గ్రామస్తులు షాక్కు గురయ్యారు.
Odisha: ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన ఆ బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, మరుసటి ఉదయం కాలువలో ఆమె మృతదేహం కనిపించింది. దీంతో గ్రామం మొత్తం విషాదంలో మునిగిపోయింది.
బాలిక శరీరంపై ఉన్న గాయాల వల్ల ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చెవులు తెగిపోవడం, కళ్లు పీకేయడం వంటి భయానక దృశ్యాలు ఆగ్రహానికి కారణమయ్యాయి.
ఇది కూడా చదవండి: Onam Sadya: తొలిసారి ఓనమ్ సాధ్య విందు రుచి చూసిన ఫ్రెంచ్ మహిళ..ఏం చెప్పిందంటే!
ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహంతో రహదారిని దిగ్బంధించారు. అంగుల్ – బంటల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నిందితులను వెంటనే పట్టుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు ఆందోళన చేపట్టారు.
సమాచారం అందుకున్న ఎస్పీ రాహుల్ జైన్, ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్మార్టం నివేదిక వెలువడిన తర్వాతే అసలు మరణ కారణం బయటపడనుంది.
ఈ సంఘటనతో గ్రామ ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చిన్నారుల భద్రతపై మరోసారి చర్చ మొదలైంది. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
