Mohammed Siraj: భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్‌కి ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు లభించింది. ఆగస్టు 2025కి గాను ఇచ్చే ఈ అవార్డులో సిరాజ్ న్యూజిలాండ్ పేసర్ మ్యాట్ హెన్రీ, వెస్టిండీస్ బౌలర్ జైడెన్ సీల్స్లపై పైచేయి సాధించారు.
Mohammed Siraj: ఇంగ్లాండ్‌తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేయడంలో సిరాజ్ కీలక పాత్ర పోషించారు. మొత్తం 9 ఇన్నింగ్స్‌లలో 23 వికెట్లు తీయడం ఆయన ప్రతిభకు నిదర్శనం. ఈ సిరీస్‌లో ఆయన రెండు సార్లు 5 వికెట్లు, ఒకసారి 4 వికెట్లు సాధించారు. 32.43 సగటుతో వికెట్లు తీసి టీమిండియాకు గణనీయమైన సహాయం చేశారు.
ఇది కూడా చదవండి: Viral News: ఇదెక్కడి విడ్డురం మావా కంటైనర్‌లో 64 కి.మీ ప్రయాణం చేసిన కొండచిలువ!
ఓవల్ టెస్ట్‌లో సిరాజ్ వేసిన అద్భుతమైన స్పెల్ ఆయన అవార్డు గెలుచుకోవడానికి కీలకం అయింది. ఆ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 9 వికెట్లు తీయడం ద్వారా టీమిండియాకు విజయాన్ని అందించడమే కాకుండా, సిరీస్‌ను కూడా డ్రా చేయించారు. సిరీస్ మొత్తం అన్ని టెస్టుల్లో ఆడిన ఏకైక భారత పేసర్ కూడా సిరాజ్‌నే.
అవార్డు గెలిచిన తర్వాత సిరాజ్ మాట్లాడుతూ:
- “ఈ అవార్డు నాకు చాలా ప్రత్యేకం. ఆండర్సన్-టెండూల్కర్ సిరీస్ అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. రెండు జట్ల మధ్య గట్టి పోటీ జరిగింది” అన్నారు.
- “ఈ అవార్డు నా సపోర్ట్ స్టాఫ్, జట్టు సభ్యులందరికీ చెందింది. వారు నాపై ఉంచిన నమ్మకానికి ఇది గుర్తింపు” అని చెప్పారు.
- “భారత జెర్సీ ధరించినప్పుడల్లా నా లక్ష్యం ఒకటే – నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడం” అని సిరాజ్ స్పష్టం చేశారు.
ఈ విజయం తో సిరాజ్ తన కెరీర్లో మరో మైలురాయిని చేరుకున్నాడు.
