Rahul Gandhi Arrest: దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా కూటమి ర్యాలీ ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. 2024 లోక్సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విపక్ష పార్టీలు సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం (EC) కార్యాలయానికి మార్చ్ చేస్తూ వెళ్తున్న సమయంలో, పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ జరగడం కారణంగా రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన నేతలను ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్కు తరలించారు.
Rahul Gandhi Arrest: ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ నుంచి బయలుదేరగానే, పోలీసులు సంసద్ మార్గ్ను బ్లాక్ చేశారు. EC భేటీకి 30 మందికే అనుమతి ఉందని అధికారులు ప్రకటించగా, “మేమంతా కలిసే వెళ్తాం” అని విపక్ష ఎంపీలు పట్టుబట్టారు. కొందరు బారికేడ్లు ఎక్కి అవతలికి దూకగా, మరికొందరు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులు ర్యాలీని అడ్డుకొని పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Air India: ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం..కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Arrest: విపక్ష నేతలు 2024 లోక్సభ ఎన్నికల్లో “ఓట్ల చోరీ” జరిగిందని ఆరోపిస్తున్నారు. బిహార్లో ఓటర్ జాబితా ప్రత్యేక సవరణపై కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఓటర్ల కోసం మాత్రమే ఫామ్-6 ఉపయోగించాలి కానీ, మొదటిసారి ఓటు వేయనివారు కాని వృద్ధులకూ అదే ఫారమ్ పదేపదే వాడుతున్నారని రాహుల్ గాంధీ EC దృష్టికి తీసుకువెళ్లారు. ఆయన శకున్ రాణి అనే ఓటరు ఉదాహరణను సమర్పించారు.
Rahul Gandhi Arrest: రాహుల్ గాంధీ ఆరోపణ ప్రకారం, ఇలాంటి ఎన్నో ఓట్ల గోల్మాల్ బయటపడే అవకాశం ఉన్నా, EC తమకు డిజిటల్ డేటా ఇవ్వడంలేదని అన్నారు. ఈ పరిణామాలు రాజధానిలో విపక్ష-పోలీసుల మధ్య ఉద్రిక్తతకు దారితీశాయి.
