Mass Jathara Teaser: మాస్ జాతర టీజర్ డబుల్ ఎనర్జీతో రవితేజ, యాక్షన్-కామెడీ ఫుల్ మీల్స్

Mass Jathara Teaser

Mass Jathara Teaser: మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాస్ జాతర సినిమా టీజర్ విడుదలైంది. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది.

Mass Jathara Teaser: చాలా కాలంగా పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్న రవితేజ, ధమాకా తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయాన్ని అందుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈసారి మాస్ జాతరతో మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్ రెండింటినీ అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తాజాగా విడుదలైన టీజర్‌లో రవితేజ తనకు ప్రత్యేకమైన డబుల్ ఎనర్జీతో, పోలీస్ పాత్రలో కనిపించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు రవితేజ మార్క్ కామెడీ కూడా అందులో చోటు చేసుకుంది.

ఇది కూడా చదవండి: Rahul Gandhi Arrest: ఢిల్లీలో హైటెన్షన్‌ – రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్

Mass Jathara Teaser: రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించగా, ఆయన-రవితేజ కాంబినేషన్ సీన్స్ టీజర్‌లోనే మంచి ఎంటర్‌టైన్‌మెంట్ హామీ ఇస్తున్నాయి. ఫ్యాన్స్ రవితేజను ఎలా చూడాలనుకుంటారో, ఆ స్టైల్‌లోనే ఈ సినిమాలో ఆయన కనిపిస్తున్నారని టీజర్ సూచిస్తోంది.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాతో భాను భోగవరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మాస్ జాతర ఆగస్టు 27న వినాయక చవితి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. టీజర్ ఇప్పటికే రవితేజ అభిమానుల్లో భారీగా అంచనాలు పెంచింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *