Air India: తిరువనంతపురం నుండి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI 2455 విమానంలో ప్రాణాపాయ ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటనపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపీ కేసి వేణుగోపాల్ ఎక్స్ (మాజీ ట్విట్టర్) లో చేసిన వ్యాఖ్యలు ప్రయాణికుల్లో కలవరాన్ని రేకెత్తించాయి. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో అల్లకల్లోలం చోటుచేసుకున్నదని, గంట తర్వాత కెప్టెన్ సాంకేతిక లోపం ఉందని ప్రకటించి విమానాన్ని చెన్నైకి మళ్లించారని ఆయన తెలిపారు.
Air India: వేణుగోపాల్ వివరాల ప్రకారం, చెన్నై చేరుకున్న తర్వాత దాదాపు రెండు గంటల పాటు ల్యాండ్ చేసేందుకు అనుమతి కోసం గాల్లోనే వేచి చూశారు. మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్వేపై మరొక విమానం ఉన్నట్లు సమాచారం అందడంతో, పైలట్ వెంటనే విమానాన్ని పైకి లేపి పెద్ద ప్రమాదాన్ని తప్పించాడు.
ఇది కూడా చదవండి: India: అమెరికాకు అత్యధిక స్మార్ట్ఫోన్ సరఫరాదారు మనమే..కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
Air India: రెండవ ప్రయత్నంలో సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. పైలట్ నైపుణ్యం, అదృష్టం వల్లే ప్రాణాలతో బయటపడ్డామని వేణుగోపాల్ పేర్కొన్నారు. ప్రయాణికుల భద్రత అదృష్టంపై ఆధారపడకూడదని, ఈ ఘటనపై డిజిసిఏ, విమానయాన శాఖ తక్షణ దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Air India: ఈ ఘటనపై ఎంపీ మణికం ఠాగూర్ కూడా స్పందిస్తూ, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, దీనిపై ప్రధాని మోదీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని కోరారు. ఎయిర్ ఇండియా తమ ప్రకటనలో ప్రయాణికుల భద్రత ఎల్లప్పుడూ తమ ప్రాధాన్యత అని స్పష్టం చేసింది. అనుమానిత సాంకేతిక సమస్య, చెడు వాతావరణ పరిస్థితుల కారణంగా చెన్నైకి మళ్లించామని తెలిపింది.
Air India flight AI 2455 from Trivandrum to Delhi – carrying myself, several MPs, and hundreds of passengers – came frighteningly close to tragedy today.
What began as a delayed departure turned into a harrowing journey. Shortly after take-off, we were hit by unprecedented…
— K C Venugopal (@kcvenugopalmp) August 10, 2025
Air India: మొదటి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్వేపై మరో విమానం ఉండటం కారణం కాదని, ATC సూచన మేరకు రౌండ్-అవుట్ చేపట్టామని వివరించింది. పైలట్లు అటువంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనే శిక్షణ పొందారని, అన్ని ప్రామాణిక విధానాలు అనుసరించారని ఎయిర్ ఇండియా పేర్కొంది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో జరిగిన ఈ ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
