Local Body Elections: లెక్కలన్నీ చెప్పాల్సిందే.. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ రూల్స్ ఇవే!

Local Body Elections: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలలో అన్ని వివరాలు కచ్చితంగా సమర్పించాల్సిందే. ఈ మేరకు అభ్యర్థులు నామినేషన్స్ లో ఏ వివరాలు ఇవ్వాలి అనేది ఎన్నిక కమిషన్ ప్రకటించింది .   లోకల్ బాడీ ఎలక్షన్స్లో పోటీచేసే క్యాండిడేట్స్ తమ ఆస్తుల వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్ఈసీ తెలిపింది. విద్యార్హతలు, ఇద్దరు సాక్షులతో సంతకాలు చేయించాలని స్పష్టం చేసింది. క్యాండిడేట్స్ తమ నేరచరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతలకు సంబంధించిన ఇద్దరు సాక్షులు ధ్రువీకరించిన స్వీయ ప్రకటన(అఫిడవిట్)ను నామపత్రంతో పాటు దాఖలు చేయాల్సి ఉంటుందని ఇటీవల రాష్ట్ర ఎన్నికల నియమావళి స్పష్టంగా పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాటు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ బి. రాణి కుముదిని ఆదేశించారు. స్థానిక సంస్థల ని పై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అన్ని జిల్లాల అధికారులతో బుధవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

Local Body Elections: పంచాయతీ అభ్యర్ధులు తెలపాల్సిన వివరాలివే . .

జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు, సర్పంచ్ వార్డులకు పోటీ చేసే అభ్యర్ధులు నేరపరమైన పూర్వాపరాలు, సివిల్, క్రిమినల్ కేసులు, విధించిన శిక్షలు, కోర్టుల్లో పెండింగ్ కేసులు వంటి వివరాలతో పాటు తమకు సంబంధించిన స్థిర, చరాస్తులు, అప్పులు, విద్యార్హతలను విధిగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. అభ్యర్థి తనతో పాటు కుటుంబ సభ్యులైన భార్య, కుమార్తె, కుమారుడికి సంబంధించిన వివరాలను సైతం పొందుపర్చాలి. ఒకవేళ కుమార్తెకు వివాహమైతే ఆమె వివరాలు వెల్లడిం చాల్సిన అవసరం లేదు. కుమారుడికి వివాహమైతే కోడలి వివరాలు పేర్కొనాలి. అలాగే నామినేషన్ పత్రంతో పాటు అందించే ధ్రువీకరణ పత్రంలో ఏ ఒక్క గడిని ఖాళీగా వదిలేయ కూడదు .  తనకు వర్తించదని స్పష్టంగా రాయాల్సి ఉంటుంది .  లేదంటే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు ఇంకా పూర్తి వివరాలను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అదే రోజు ప్రదర్శిస్తుంది. స్వీయ ధ్రువీకరణ తప్పుగా ఇచ్చినట్లు రుజువైతే క్రిమినల్ కేసు నమోదవుతుందని ఎన్నికల నియమావళి స్పష్టంగా తెలిపింది.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎంపీ అభ్యర్థుల మాదిరిగానే..

Local Body Elections: శాసనసభ, శాసనమండలి, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ అభ్యర్థుల నుంచి అఫిడవిట్ ద్వారా ఈసారి వివరాలు తెలుసుకుంటున్న ఎన్నికల సంఘం తొలిసారిగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వివరాలను పక్కాగా తెలుసుకోవాలని నిర్ణయించింది.

మొత్తం 5 విడతలుగా

ఎంపీటీసీ, జడ్పీటీసీలకు అక్టోబర్ 23న తొలివిడత 27న రెండో విడత ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపిన విషయం తెలిసిందే. గ్రామ పంచాయతీలకు తొలి విడత అక్టోబర్ 31న, రెండో విడత నవంబర్ 4న, మూడో విడత నవంబర్ 8న నిర్వహిస్తామని తెలిపింది. ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత అదే రోజు గ్రామ పంచాయతీల ఓట్ల లెక్కింపు చేపడతారు.
-నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు నవంబర్ 11న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు జరుగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. తెలంగాణలోని 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్ల
వివరించారు. 5,749 ఎంపీటీసీ, 565 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 1,733 గ్రామపంచాయతీలు, 1,12,288 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ నోటిఫికేషన్

Local Body Elections: యథావిధిగా ఎన్నికల  స్థానిక సంస్థల నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. బుధవారం హైకోర్టు ఎన్నికలకు స్టే ఇచ్చేందుకు నిరాకరించగా, మొదటి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం కమిషనర్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా వెల్లడించారు. నామినేషన్లు, శాంతిభద్రతలపై ఈసీ పలు సూచనలు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *