National Teachers Awards: జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025.. దేశవ్యాప్తంగా 45 మందికి గౌరవం,

National Teachers Awards: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 45 మంది ఉపాధ్యాయులకు జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025 ప్రదానం చేశారు. శుక్రవారం (సెప్టెంబర్ 5) రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందజేశారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో అంకితభావం, వినూత్న బోధనా పద్ధతులు, క్లిష్ట పరిస్థితుల్లోనూ బోధనలో చూపిన ప్రతిభ ఆధారంగా ఈ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి.

National Teachers Awards: ఈ ప్రతిష్టాత్మక జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎం. దేవానంద కుమార్ కూడా చోటు దక్కించుకున్నారు. ఆయన మైలవరంకి లోని డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. తాళ్లపత్ర గ్రంథాలను సృష్టించడం, LMS కోసం విద్యా వీడియోలు రూపొందించడం, విద్యార్థులకు స్ఫూర్తిదాయకమైన బోధన అందించడం వంటి కృషికి గాను ఆయనను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేశారు.

ఇది కూడా చదవండి: Amit Shah Visit: కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన రద్దు.. కారణం ఇదేనా?

అరుణాచల్ ప్రదేశ్ నుంచి ప్రోశాంతో క్ర సాహా (రాజీవ్ గాంధీ సెంట్రల్ యూనివర్సిటీ, సైకాలజీ ఫ్యాకల్టీ) అవార్డు అందుకున్నారు. ఆయన 14 ఏళ్లకుపైగా ఫోరెన్సిక్ సైకాలజీ, న్యూరోసైకాలజీలో నైపుణ్యం సాధించారు. న్యూరోసైకాలజీ ల్యాబ్ స్థాపించడం, శిక్షణా మాడ్యూళ్ల అభివృద్ధి చేయడం, పిల్లలపై వేధింపులకు గురైన వారికి మానసిక మద్దతు అందించడం వంటి కృషికి గాను ఆయనకు గుర్తింపు లభించింది.

అవార్డుల ప్రదానోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అవార్డు గ్రహీతలతో సంభాషిస్తూ, “ఉపాధ్యాయులు సాధారణంగా విద్యార్థులకు హోంవర్క్ ఇస్తారు. కానీ ఇప్పుడు మీరు దేశానికి ఒక హోంవర్క్ చేయాలి. ‘మేక్ ఇన్ ఇండియా’, ‘వోకల్ ఫర్ లోకల్’ ఉద్యమాలను బలోపేతం చేయడానికి మీరే ముందుండాలి” అంటూ పిలుపునిచ్చారు.

జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల కృషికి దక్కిన ఈ గౌరవం, భారత విద్యావ్యవస్థలో ఉపాధ్యాయుల పాత్ర ఎంత ముఖ్యమో మరోసారి చాటిచెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *