Nara Lokesh-PM Modi: జీఎస్టీ సంస్కరణలతో ఉపశమనం.. ప్రధాని మోదీతో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ!

Nara Lokesh-PM Modi: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్ గురువారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు సాగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగింది.

Nara Lokesh-PM Modi: ఈ సందర్భంగా నారా లోకేశ్, ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, అలాగే తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధాని మోదీతో వివరంగా చర్చించారు. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోతున్న అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజీ (ASIP) సెమీకండక్టర్ యూనిట్ ఆమోదించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఇది రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మలుపు అవుతుందని లోకేశ్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో పెద్దఎత్తున పరిశ్రమలు స్థాపించేందుకు కేంద్రం సహకరించాలని లోకేశ్ అభ్యర్థించారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగి, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని ఆయన నొక్కిచెప్పారు.

ఇది కూడా చదవండి: Viral News: భార్యల మాట వినే భర్తలకు గుడ్ న్యూస్..సంతోషకరమైన జీవితం రహస్యం ఇదే..!

విద్యాశాఖ మంత్రిగా, లోకేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విద్యా సంస్కరణలు ప్రధానమంత్రికి వివరించారు. ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన నెక్స్ట్-జనరేషన్ జీఎస్టీ సంస్కరణలు దేశవ్యాప్తంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఉపశమనం కలిగించాయని ఆయన అభినందించారు. ఈ మార్పులు ఆంధ్రప్రదేశ్‌లోని MSMEలు, చిన్న వ్యాపారాలు, మధ్యతరగతి ప్రజలకు మేలుచేస్తాయని లోకేశ్ స్పష్టం చేశారు.

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేంద్ర మద్దతుతో అనేక సంక్షేమ – అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా అమలయ్యాయని ఆయన గుర్తుచేశారు. మోదీ నేతృత్వంలోని వికసిత్ భారత్ 2047 జాతీయ లక్ష్యానికి ఆంధ్రప్రదేశ్ దోహదపడుతుందని తెలిపారు.

అంతేకాక, కొన్ని రాష్ట్రానికి సంబంధించిన సమకాలీన పరిణామాలను కూడా ప్రధానమంత్రికి లోకేశ్ వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ, ఏపీ అభివృద్ధికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి లోకేశ్, జూన్‌లో జరిగిన యోగాంద్ర వేడుకలపై రూపొందించిన కాఫీ టేబుల్ పుస్తకాన్ని ప్రధాని మోదీకి అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *