Mega DSC 2025 Counselling: సెప్టెంబర్‌ 22 నుంచి డీఎస్సీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల!

Mega DSC 2025 Counselling: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహించిన మెగా డీఎస్సీ 2024 ద్వారా 16,347 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 5,77,675 దరఖాస్తులు అందగా, 15,941 మంది అభ్యర్థులు తుది ఎంపిక జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఇందులో 7,955 మంది మహిళలే ఉండటం విశేషం. అయితే రిజర్వేషన్‌ కారణాల వల్ల 406 పోస్టులు ఖాళీగా మిగిలిపోయాయి.

Mega DSC 2025 Counselling: ప్రాథమిక ‘కీ’పై వచ్చిన 40 వేల అభ్యంతరాలను పరిశీలించి తుది కీని రూపొందించారు. రాత పరీక్షలో 80% వెయిటేజీ, టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET)లో 20% వెయిటేజీ కలిపి తుది ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 69 కేటగిరీల్లో డీఎస్సీ నిర్వహించగా, అందులో 9 కేటగిరీల్లో నార్మలైజేషన్‌ విధానం అమలు చేశారు.

ఇది కూడా చదవండి: Konaseema: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన టేకు చేప!

అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలనను ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 13 వరకు 7 విడతల్లో నిర్వహించారు. ముఖ్యంగా ఈ సారి తొలిసారిగా క్రీడా కోటా (3%) రిజర్వేషన్‌ అమలు చేయబడింది. రాత పరీక్ష లేకుండానే 372 మంది క్రీడాకారులు ఉద్యోగాలు పొందారు.

ఇక ఎంపికైన అభ్యర్థులకు సెప్టెంబర్‌ 22 నుంచి 29 వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. దసరా సెలవుల్లో కొత్తగా ఎంపికైన అధ్యాపకులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించగా, అనంతరం వారు తమకు కేటాయించిన బడుల్లో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *