Konaseema: కోనసీమ జిల్లా అంతర్వేది సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన పులి మచ్చల టేకు చేప చిక్కింది. సుమారు 10 నుంచి 15 కిలోల బరువున్న ఈ చేప స్థానికులలో ఆసక్తి రేపింది. వేలం పాటలో మంచి ధర పలికిన ఈ చేప, ఔషధ గుణాలు కలిగిన అరుదైన జాతిగా గుర్తించబడింది.
Konaseema: మత్స్యకారుల వివరాల ప్రకారం, ఈ టేకు చేప పొట్ట భాగంలోని బ్లాడర్లో ఔషధ గుణాలు ఉండటం వల్ల మందుల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. అదేవిధంగా, ఆక్వేరియం పెంపకానికి కూడా దీనికి మంచి డిమాండ్ ఉంటుంది. సాధారణంగా ఈ చేప ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచూ ప్రయాణిస్తుంది. అప్పుడప్పుడు వలలో చిక్కితే, మత్స్యకారులకు అదృష్టం తెచ్చిపెడుతుందని వారు తెలిపారు.
ఇది కూడా చదవండి: Viral Video: కూతురి మంచం మీద నల్ల తాచు.. వీడియో తీస్తున్న తల్లిదండ్రులు నెటిజన్ల ఆగ్రహం
ఈ చేప ఈశాన్య భారతదేశంలోని బ్రహ్మపుత్రా నది పరిసర అసోం, అరుణాచలప్రదేశ్ తీర ప్రాంత సముద్రాల్లో మాత్రమే అరుదుగా కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇది రేప్ ఫిష్గా గుర్తింపు పొందింది.
వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, పులి మచ్చల టేకు చేపలో ప్రోటీన్ అధికంగా ఉండటం వల్ల కండరాల పెరుగుదలకు తోడ్పడుతుంది. అంతేకాకుండా తక్కువ కొవ్వు ఉండటం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా సహాయకారిగా పనిచేస్తుంది.
