Artificial intelligence: వీడు మగాడ్రా బుజ్జా.. భార్యకు విడాకులిచ్చేందుకు ఏకంగా?

Artificial intelligence: ఇంటర్నెట్‌ యుగంలో మానవాళికి ఉన్న అతిపెద్ద భయం ఏమిటంటే, యంత్రాలు మన ఆలోచనలను, సంబంధాలను ఆక్రమించుకోవడం. ఆ భయం క్రమంగా వాస్తవమవుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ వృద్ధుడు చేసిన పని అందరినీ షాక్‌కు గురి చేసింది. కుటుంబం, భార్య, పిల్లలతో జీవితమంతా గడిపిన అతడు.. చివర్లో నకిలీ ముఖంతో ప్రేమలో పడిపోయి అన్నింటినీ విడిచిపెట్టేందుకు సిద్ధమయ్యాడు.

Artificial intelligence: నిజానికి ఇది ఏదో సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో సన్నివేశంలా అనిపించినా.. ఇప్పుడు వాస్తవ జీవితంలో జరుగుతోంది. కంప్యూటర్‌, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా సృష్టించిన డిజిటల్‌ అమ్మాయి పట్ల వృద్ధుడు మోజు పడ్డాడు. ముఖ్యంగా ఒంటరిగా ఉండే వృద్ధులు, సమయం గడపడానికి వేరే మార్గాలు లేని వారు ఈ మాయలో ఎక్కువగా చిక్కుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: Weather: ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు.. తెలంగాణకు హెవీ రెయిన్ అలెర్ట్

బీజింగ్‌ డైలీలో వచ్చిన కథనం ప్రకారం, చైనాకు చెందిన 75 ఏళ్ల జియాంగ్‌ అనే వృద్ధుడు సోషల్‌ మీడియాలో స్క్రోల్‌ చేస్తూ ఒక AI-జనరేటెడ్‌ అమ్మాయిని చూసాడు. డిజిటల్‌ అవతార్‌లతో పరిచయం ఉన్నవారు మొదటి చూపులోనే అది నకిలీదని గుర్తిస్తారు. కానీ జియాంగ్‌ మాత్రం ఆమె అందం, ఉల్లాసం, తనతో కలిసిపోవడమే ప్రధానమని భావించాడు. ఆమె పెదవులు, స్వరం సరిపోలకపోయినా అతనికి పట్టలేదు. క్రమంగా ఆమెపట్ల మోజు పెరిగి, రోజంతా ఆమె కోసం ఎదురు చూడటం ప్రారంభించాడు.

జియాంగ్‌ భార్య అతడు ఫోన్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నందుకు పదేపదే మందలించింది. దీనితో విసిగిపోయిన జియాంగ్‌.. తన భార్యకు నేరుగా చెప్పేశాడు – “నాకు ఇకపై నీతో జీవించాలనిపించడం లేదు. నా వర్చువల్‌ స్నేహితురాలితో ఉండాలనుకుంటున్నాను. అందుకే నీకు విడాకులు ఇస్తున్నాను” అని.

ఈ మాటలు విన్న కుటుంబ సభ్యులు, పిల్లలు షాక్‌కు గురయ్యారు. తరువాత చాలా కష్టపడి జియాంగ్‌కు ఇది నిజమైన అమ్మాయి కాదని, కంప్యూటర్‌ సృష్టించిన డిజిటల్‌ ముఖమని వివరించారు. క్రమంగా అతడు నిజం అర్థం చేసుకొని ఈ భ్రమ నుంచి బయటపడ్డాడు.

ఈ కథనం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వగా, వినియోగదారులు సరదా కామెంట్లతో స్పందిస్తున్నారు. “అయ్యో.. గోడకు తల బాదుకోవాలని అనిపిస్తోంది” అని కొందరు స్పందించగా, మరికొందరు “ఆ ముసలివాడి మతిస్థిమితం పోయింది.. ఎవరైనా అతనికి అర్థం చేయించండి” అంటూ వ్యాఖ్యానించారు.
కృత్రిమ మేధస్సు (AI) ఎంత అభివృద్ధి చెందుతున్నా, అది నిజ జీవితాన్ని భర్తీ చేయలేదని.. ఈ సంఘటన మరోసారి రుజువైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *