Crime News: షాకింగ్ ఘటన ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య స్కెచ్

Crime News: వివాహేతర సంబంధం కోసం భర్త ప్రాణం తీసేందుకు భార్య ప్రియుడితో కలిసి భయంకర ప్లాన్ వేసిన ఘటన వరంగల్‌లో బయటపడింది. చనిపోయాడనుకున్న భర్త బతికిపోవడంతో అసలు స్కెచ్ బహిర్గతమై, భార్యతో పాటు ప్రియుడు పోలీసుల చెరపట్టారు.

Crime News: ఈ సంఘటన వరంగల్‌లోని మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆగస్టు 14న జరిగింది. రాజు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు పోతననగర్ డంపింగ్ యార్డు వద్దకు తీసుకెళ్లి, క్రూరంగా చిత్రహింసలు పెట్టారు. అతన్ని చంపేశామని భావించి అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. కానీ, స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రాజును ఆసుపత్రికి తరలించారు. వైద్యం తర్వాత ప్రాణాలతో బయటపడ్డాడు.

ఇది కూడా చదవండి: Putin Bodyguards: ఇదేం చోద్యం సామీ..! పుతిన్ బాడీగార్డ్‌ల ప్రత్యేకత ఏమిటంటే?

రాజు భార్య గంగరబోయిన పద్మకు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి చెందిన పోతుల సందీప్‌తో మూడు సంవత్సరాలుగా పరిచయం ఉంది. అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. పద్మ, తన భర్త రాజుతో స్నేహం చేయించి సందీప్ తరచుగా ఇంటికి వచ్చేలా చేసేది. ఈ వ్యవహారం రాజుకు తెలిసిపోవడంతో భార్యను మందలించాడు.

దీనితో ఆగ్రహించిన పద్మ, తన ప్రియుడు సందీప్‌తో కలిసి భర్తను చంపే ప్లాన్ వేసింది. రాజుపై హత్యాయత్నం చేయడానికి సందీప్ తన స్నేహితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్‌లను కలుపుకున్నాడు. 14వ తేదీ రాత్రి నలుగురూ రాజుపై దాడి చేసి, అతన్ని విచక్షణారహితంగా కొట్టి గొంతు నులిమారు. స్పృహ తప్పడంతో చనిపోయాడనుకుని వదిలేశారు.

రాజు ప్రాణాలతో బయటపడటమే కాకుండా, మొత్తం కథనం వెలుగులోకి వచ్చింది. రాజు చనిపోయాడని భావించిన పద్మ, వెంటనే సందీప్‌కు రూ.3 లక్షలు ఇచ్చింది. తర్వాత భర్త బతికున్నాడని తెలుసుకుని, ఇంటిలో ఉన్న మరో రూ.6 లక్షలు తీసుకుని ప్రియుడితో పారిపోయింది.

రాజు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా పద్మ, సందీప్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ముగ్గురు నిందితులు ప్రమోద్, షబ్బీర్, స్వర్ణాకర్ పరారీలో ఉన్నారు. అరెస్టయిన వారి వద్ద నుంచి రూ.5.40 లక్షలు, ఒక కారు, రెండు స్మార్ట్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *