Andhra Minor Girl: అన్నే కదా అని బైక్ ఎక్కింది.. మామిడి తోటలో అమానుషం!

Andhra Minor Girl: చిత్తూరు జిల్లాలో మైనర్ బాలికపై జరిగిన దారుణం వెలుగులోకి వచ్చింది. అన్న వరుస అవుతానన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేసిన వ్యక్తి, నిరపరాధ 11 ఏళ్ల బాలికను మామిడి తోటకు తీసుకెళ్లి అమానుషానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లిలో చోటుచేసుకుంది.

Andhra Minor Girl: స్థానిక పాఠశాలలో 6వ తరగతి చదువుతున్న బాలికను స్కూల్ వద్ద వదిలేస్తానని 40 ఏళ్ల ప్రసాద్ అనే వ్యక్తి బైక్‌పై ఎక్కించుకున్నాడు. బాలికకు వరుస అన్నయ్య అవుతానని తల్లిదండ్రులు నమ్మకంతో పంపించారు. అయితే స్కూల్‌కు తీసుకెళ్లాల్సిన అతడు.. ఊరి చివర మామిడి తోట వద్ద ఆగి దారుణానికి పాల్పడ్డాడు.

ఇది కూడా చదవండి: AP Prisons Department: ఆంధ్రప్రదేశ్‌ జైళ్ల శాఖలో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

అక్కడే బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడు, ఈ విషయం ఎవరికి చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. అనంతరం పాఠశాల వద్ద వదిలిపెట్టాడు. బాధతో కన్నీరు మున్నీరు కారుస్తూ బాలిక తనపై జరిగిన అమానుషాన్ని ఉపాధ్యాయులకు వివరించింది.

వెంటనే ఉపాధ్యాయులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించగా, వెదురుకుప్పం పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *