Mother Reaction: కొడుకు అమ్మాయిలతో స్టేజీపై డ్యాన్స్‌.. తల్లి రాగానే ఏం జరిగిందో చూస్తే పగలబడి నవ్వుతారు!

Mother Reaction: సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో రకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొన్నిసార్లు అలాంటి వీడియోలు చూసే వారిని కడుపుబ్బ నవ్విస్తాయి. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Mother Reaction: గ్రామంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఓ బాలుడు ఇద్దరు అమ్మాయిలతో కలిసి వేదికపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. చుట్టూ ఉన్నవారంతా చప్పట్లు కొడుతూ డ్యాన్స్‌ను ఆస్వాదిస్తున్నారు. ఆ వేదిక వాతావరణం పూర్తిగా హర్షధ్వానాలతో మారిపోయింది.

అప్పుడే అక్కడికి బాలుడి తల్లి చేతిలో కర్రతో చేరుకుంది. తన తల్లిని చూసిన వెంటనే బాలుడి ముఖ చిరునవ్వు మాయమై.. భయంతో వేదికపై నుండి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆపై తల్లి కోపంతో కొడుకుపై కర్రను ఎత్తింది.

“అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తావా?” అంటూ తల్లి కొడుకును బాదిన ఈ సీన్ చూసి అక్కడున్న వారు షాక్ అయ్యారు. అయితే ఈ సంఘటనను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం పగలబడి నవ్వుతున్నారు. ఈ వీడియోను X ప్లాట్‌ఫామ్‌లో @lok62678 అనే యూజర్ షేర్ చేయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *