Mumbai Bomb Threat: 400 కిలోల RDX, 34 కార్లు.. కోటి మంది లక్ష్యం.. ముంబైలో 26/11 కంటే పెద్ద దాడి?

Mumbai Bomb Threat: ముంబై మళ్లీ బాంబు బెదిరింపులతో కుదిపిపోయింది. ఈసారి సాధారణ హెచ్చరిక కాదు, నేరుగా మానవ బాంబుల దాడి చేస్తామని ఉగ్రవాదులు సందేశం పంపారు. ఏకంగా కోటి మందిని లేపేస్తామని, వినాయక నిమజ్జనం సందర్భంగా ఘోర దాడి చేస్తామని హెచ్చరించారు.

Mumbai Bomb Threat: ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్‌కు వచ్చిన ఈ సందేశం పోలీసులు అప్రమత్తం కావడానికి కారణమైంది. 34 కార్లలో మానవ బాంబులు అమర్చామని, 400 కిలోల RDX సిద్ధం చేసామని అందులో పేర్కొన్నారు. ‘లష్కర్-ఎ-జిహాదీ’ ఉగ్రవాదులు ఈ దాడి చేస్తారని, 14 మంది పాకిస్తానీ టెర్రరిస్టులు భారత్‌లోకి ప్రవేశించారని మెసేజ్‌లో స్పష్టంగా చెప్పారు.

ఈ బెదిరింపు కారణంగా ముంబై పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భారీగా జనం గుమికూడే అవకాశం ఉన్నందున ఎలాంటి చిన్న సమాచారం వచ్చినా పోలీసులు నిర్లక్ష్యం చేయట్లేదు. ఇప్పటికే కీలక ప్రాంతాల్లో భద్రతా బలగాలను పెంచారు.

ఇది కూడా చదవండి: Amit Shah: బీజేపీలో రికార్డుల మోత… అమిత్ షా ఓ సంచలన ఘనత

ఇదివరకూ కూడా ముంబై పోలీసులకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. కొన్నిసార్లు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ ద్వారా, మరికొన్నిసార్లు వాట్సాప్ సందేశాల ద్వారా. ఇటీవల వర్లిలోని ఫోర్ సీజన్స్ హోటల్ పేల్చేస్తామని హెచ్చరిక వచ్చింది. అలాగే ఆగస్టు 14న రైలులో బాంబు పేలుస్తామని కూడా ఫోన్ కాల్ వచ్చింది. దర్యాప్తులో ఎటువంటి అనుమానాస్పద అంశాలు బయటకు రాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

జూలై 26న కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) స్టేషన్‌ను పేల్చేస్తామని బెదిరింపు వచ్చింది. అయితే ఆ సందర్భంలో కూడా పరిశీలనలో ఏమీ దొరకలేదు. కానీ ఈసారి వచ్చిన హెచ్చరిక మాత్రం చాలా సీరియస్‌గా భావిస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *