Crime News: నెలన్నర పసికందుతో ఇద్దరు పిల్లలను హతమార్చిన తల్లి తరువాత ఆత్మహత్య!

Crime News: సంగారెడ్డి జిల్లా నిజాంపేట్‌లో ఒకే కుటుంబంలో చోటుచేసుకున్న దారుణం స్థానికులను కన్నీరు మున్నీరుగా చేసింది. నెలన్నర పసికందు సహా ఇద్దరు కుమారుల్ని హతమార్చి, తల్లి కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో ఎటు చూసినా విషాద ఛాయలు అలుముకున్నాయి.

Crime News: నిజాంపేట్‌కు చెందిన బూషి ప్రేమల (22), దామరచెరువు గ్రామానికి చెందిన కొత్తపల్లి సంగమేశ్వర్‌ను మూడు సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. ఈ దంపతులకు మూడేళ్ల కుమారుడు ధనుష్‌, నెలన్నర పసికందు సూర్యవంశీ ఉన్నారు. ఇటీవల ప్రేమలకు రెండో బిడ్డ పుట్టడంతో కొంతకాలం అత్తారింట్లో గడిపి, రెండు రోజుల క్రితం పిల్లలతో సహా పుట్టింటికి వచ్చారు.

ఇది కూడా చదవండి: Fake customer Care: గూగుల్‌లో కనిపించే నకిలీ నంబర్లు – మోసగాళ్ల కొత్త స్కాం!

అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రేమల తన ఇద్దరు కుమారుల గొంతు నులిమి హతమార్చింది. అనంతరం తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటికి ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తల్లి, ఇద్దరు పిల్లల మృతదేహాలను చూసి షాక్‌కు గురై వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక దర్యాప్తులో కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. మృతుల తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తుండగా, ఒకే కుటుంబంలో ముగ్గురి మృతితో గ్రామమంతా విషాద వాతావరణంలో మునిగిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *