Hyderabad: గచ్చిబౌలిలో హాస్టల్ వివాదం.. నిర్వాహకుడి దాడి

Crime News

Hyderabad: హైదరాబాద్ గచ్చిబౌలిలో హాస్టల్ వివాదం హడావుడి రేపుతోంది. ఐదేళ్ల క్రితం పిచ్చయ్య అనే ఓనర్‌కి చెందిన 25 ఫ్లాట్లను హాస్టల్ నిర్వహణ కోసం అద్దెకు తీసుకున్న అమర్నాథ్ రెడ్డి ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారాడు.

Hyderabad: కరోనా తర్వాత నుంచి హాస్టల్ యజమాని అద్దె చెల్లించడం ఆపేశాడు. పలు మార్లు హెచ్చరించినా స్పందించకపోవడంతో ఓనర్ పిచ్చయ్య కోర్టును ఆశ్రయించాడు. విచారణ అనంతరం 9 ప్లాట్లు ఖాళీ చేయాలని కోర్టు ఉత్తర్వులు ఇవ్వగా, పోలీసులు సహకారంతో వాటిని ఖాళీ చేయించారు. తాజాగా మరో 3 ఫ్లాట్లు ఖాళీ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఈ ప్రక్రియలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఫ్లాట్లు ఖాళీ చేయిస్తుండగా అమర్నాథ్ రెడ్డి ఆగ్రహంతో ఓనర్ పిచ్చయ్యపై దాడి చేశాడు. ఈ దాడిలో పిచ్చయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మరకలతోనే ఆయన పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఇదే సమయంలో ప్లాట్లను ఖాళీ చేయించడానికి వెళ్లిన అడ్వొకేట్‌పైనా అమర్నాథ్ రెడ్డి దాడి చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు గచ్చిబౌలి పోలీసులపై కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమర్నాథ్ రెడ్డిని కావాలనే బయటకు పంపించారని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

కోర్టు ఉత్తర్వులను సైతం ధిక్కరించిన హాస్టల్ నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ ఘటన గచ్చిబౌలిలో సంచలనం సృష్టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *