Mahbubnagar: మహబూబ్నగర్ జిల్లాలో రేబిస్ వ్యాధి అనుమానం విషాదానికి దారితీసింది. మోనప్పగుట్టలో ఓ తల్లి తన కూతురిని చంపి, తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేసింది.
Mahbubnagar: వివరాల్లోకి వెళ్తే.. యశోద అనే గృహిణి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ నేపథ్యంలో తనకు రేబిస్ సోకిందేమోనన్న అనుమానం బలంగా పుట్టింది. వ్యాధి సోకిందని భావనతో ఆమె తీవ్ర మానసిక ఆందోళనలో పడిపోయింది. చివరికి మానసిక భ్రాంతిలోనే తన కూతురిని ఊపిరాడనీయకుండా చేసి, ఆ తర్వాత తానూ ఉరి వేసుకుంది.
మరణానికి ముందు యశోద ఇంట్లో చాక్బోర్డ్, తలుపులపై సందేశాలు రాసి పెట్టింది. “కుమారుడు లక్కీ, భర్త జాగ్రత్త” అంటూ కుటుంబానికి చివరి సందేశం ఇచ్చింది. రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వ్యాధి తగ్గదని, చెట్ల మందులు (నాటు వైద్యం) మాత్రమే ఉపశమనం ఇస్తాయనే నమ్మకం ఆమెను మరింత కుంగదీసింది.
యశోద భర్త నరేష్ తెలిపిన వివరాల ప్రకారం, ఆమె అనేక రోజులుగా రేబిస్ భయం వెంటాడుతోందని, యూట్యూబ్లో కూడా ఈ వ్యాధిపై ఎక్కువగా వెతికేదని చెప్పారు. కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు నచ్చజెప్పినా ఆమెను నమ్మించలేకపోయారు.
ఈ విషాద ఘటనతో యశోద కుటుంబం మానసికంగా కుంగిపోయింది. రేబిస్ వ్యాధి భయం ఓ కుటుంబాన్ని ఏకంగా నాశనం చేసిందనే బాధతో స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు.
