Sachin Tendulkar: జో రూట్‌ ప్రతిభపై సచిన్‌ టెండూల్కర్‌ ప్రశంసలు

Sachin Tendulkar: క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ రిటైర్‌ అయినా, ఆయన రికార్డులు ఇప్పటికీ అందని ద్రాక్షగానే ఉన్నాయి. ముఖ్యంగా టెస్ట్‌ క్రికెట్‌లో ఆయన చేసిన 15,921 పరుగులు ఇప్పటికీ అగ్రస్థానంలో నిలుస్తున్నాయి.

Sachin Tendulkar: ఇక ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ జో రూట్‌ మాత్రం ఆ రికార్డుకు చేరువవుతూ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే అతను 13,000 టెస్ట్‌ పరుగులు దాటాడు. దీంతో టెండూల్కర్‌ను అధిగమించే అవకాశమున్న ఆటగాడిగా రూట్‌ గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతను సచిన్‌ రికార్డుకు కేవలం 2,378 పరుగుల దూరంలో ఉన్నాడు.

ఇటీవల రెడ్డిట్‌ AMA సెషన్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సచిన్‌ రూట్‌ ప్రతిభపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “13,000 పరుగులు దాటడం చిన్న విషయం కాదు. రూట్‌ ఇంకా ఫిట్‌గా ఉన్నాడు. 2012లో నాగ్‌పూర్‌లో అతని తొలి టెస్ట్‌ సందర్భంగా నేను అతన్ని చూసినప్పుడు, భవిష్యత్తులో ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ అవుతాడని నా సహచరులతో చెప్పాను. వికెట్‌ను అంచనా వేసే తీరు, స్ట్రైక్‌ రొటేషన్‌ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. అప్పుడే అతను గొప్ప ఆటగాడు అవుతాడని అనిపించింది” అని టెండూల్కర్‌ గుర్తు చేసుకున్నాడు.

ఇక 2025లో జరిగిన ఆండర్సన్–టెండూల్కర్‌ ట్రోఫీలో రికీ పాంటింగ్‌ను అధిగమించి, టెస్టుల్లో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రూట్‌ రికార్డు సృష్టించాడు.

ప్రస్తుతం రూట్‌ టెండూల్కర్‌ను అధిగమిస్తాడా లేదా అన్నది క్రికెట్‌ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు సచిన్‌ ప్రశంసలు రూట్‌కు మరింత ప్రోత్సాహాన్నిస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *