Chola shila: దక్షిణ భారత చరిత్రలో చోళులకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా పొత్తపి చోళులు ఆంధ్రప్రదేశ్లో తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారని పలు శాసనాలు నిరూపిస్తున్నాయి. తాజాగా నెల్లూరు జిల్లాలో వెయ్యేళ్లనాటి అరుదైన చోళుల శిలాశాసనం బయటపడింది.
Chola shila: ఈ శాసనాన్ని చరిత్రకారుడు రసూల్ గుర్తించి పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. కేంద్ర పురావస్తు శాఖ బృందం అక్కడ పరిశీలన జరిపి ఇది 12వ శతాబ్దానికి చెందిన చోళుల కాలపు శాసనమని నిర్ధారించింది. ఈ శాసనంలో అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి ముఖ్యమైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది.
మునగాల వెంకటాపురం అటవీ ప్రాంతంలోని శిథిలావస్థలో ఉన్న శివాలయం వద్ద ఈ శాసనం బయటపడింది. ఇది సుమారు నాలుగు అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పుతో గ్రానైట్ రాతిపై చెక్కబడింది. చుట్టూ గుట్టల మధ్యలో ఉన్న ఈ ఆలయ పరిసరాల్లో ఈ శాసనం లభించడం చోళుల పాలన ఆ ప్రాంతంలో బలంగా ఉందని చూపిస్తోంది.
పురావస్తు శాఖ అధికారులు ఈ శాసనాన్ని ఎంతో విలువైనదిగా అభివర్ణించారు. వెయ్యేళ్ల క్రితం ప్రజలు పలు సౌకర్యాలతో అభివృద్ధి చెందారని ఇది చెబుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇలాంటి అరుదైన శాసనాలను సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు చరిత్రను తెలుసుకునే గొప్ప అవకాశంగా నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
