Weather: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఏపీలో కొన్ని జిల్లాలకు ‘ఫ్లాష్ ఫ్లడ్స్’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణకు కూడా భారీ వర్ష సూచన జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్: ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు
Weather: విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకారం, ఏపీలోని పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ ముప్పు ఉంది. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రాగల 24 గంటల్లో ఈ జిల్లాల్లో 7 నుంచి 12 సెంటిమీటర్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నంద్యాల, కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
ఇది కూడా చదవండి : ఉగ్రవాదంపై మార్పు లేకపోతే నీళ్లు ఇవ్వం.. తేల్చి చెప్పిన భారత్
తెలంగాణ: భారీ వర్ష సూచన
Weather: ఉత్తర కోస్తాఆంధ్ర, ఒడిశా తీరాల వెంబడి అల్పపీడనం కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలంగాణలో రాగల రెండు రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో హైదరాబాద్ నగరంలో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలోని 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి, జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
