Prabhas Latest News: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో శుభవార్త. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్.. ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో కలిసి చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా సెప్టెంబర్ నెలాఖరున సెట్స్పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Prabhas Latest News: స్పిరిట్ విశేషాలు
- డైరెక్టర్: సందీప్ రెడ్డి వంగా (యానిమల్ ఫేమ్)
- హీరోయిన్: త్రిప్తి దిమ్రి
- నిర్మాతలు: భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్
- షూటింగ్: మొదటి షెడ్యూల్ విదేశాల్లో జరగనున్నట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డి ఇప్పటికే మెక్సికో, ఇండోనేషియా వంటి దేశాల్లో లొకేషన్స్ పరిశీలించారు.
- రిలీజ్: వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’, హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత ‘స్పిరిట్’ షూటింగ్లో పాల్గొంటారు. సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇది కూడా చదవండి : తరచుగా రైల్లో ప్రయాణిస్తారా? ఈ కార్డులు మీకోసమే
