Hyderabad: హైదరాబాద్ శివారు ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ.. 51 మంది ఆఫ్రికన్లు అదుపులో

Indo-Pak War

Hyderabad: హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్‌హౌస్‌లో జరిగిన రహస్య పార్టీ పెద్ద కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారులోని SKM ఫామ్‌హౌస్‌లో 51 మంది ఆఫ్రికన్ దేశస్తులు లిక్కర్, డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారని సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు నార్కోటిక్ బ్యూరో అధికారులతో కలిసి దాడులు చేపట్టారు.

Hyderabad: దాడిలో 37 మంది మహిళలు, 14 మంది పురుషులు సహా మొత్తం 51 మందిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఫుల్ సౌండ్ మ్యూజిక్, డ్యాన్సులతో ఎంజాయ్ చేస్తూ ఉన్న వీరిని పోలీసులు రంగేహస్తం పట్టారు. ఆ ప్రాంగణంలో అనేక కార్లు నిలిపివుండటం, ఆహ్లాదకరమైన వాతావరణంలో గుట్టుగా పార్టీ జరగటం దృష్టిని ఆకర్షించింది.

పోలీసులు ఫామ్‌హౌస్‌ను తనిఖీ చేయగా, డ్రగ్స్, లిక్కర్ వంటి నిషేధిత పదార్థాలు లభించాయి. అందరికీ డ్రగ్ టెస్టులు నిర్వహించగా, ముగ్గురికి పాజిటివ్‌గా తేలింది. అనంతరం ఇమ్మిగ్రేషన్ అధికారులను అప్రమత్తం చేయగా, వారు అక్కడికి చేరుకుని పట్టుబడిన వారి వీసా, పాస్‌పోర్ట్ వివరాలను పరిశీలిస్తున్నారు.

ఈ సంఘటన హైదరాబాద్ పరిసరాల్లో జరుగుతున్న అక్రమ పార్టీలపై మళ్లీ దృష్టి సారించేలా చేసింది. పోలీసులు ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఇదికూడా చదవండి :  Vehicle Rules: ఒక రాష్ట్రం రిజిస్ట్రేషన్ నంబర్ ఉన్న వాహనాన్ని మరొక రాష్ట్రంలో నడపవచ్చా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *