Chaitanyananda: కామాంధ బాబా చైతన్యానంద కేసులో షాకింగ్ రివలేషన్స్.. మొబైల్‌ ఫోన్‌ చెక్‌ చేయగా బయటపడ్డ ఫొటోలు!

Chaitanyananda: ఢిల్లీలోని ఒక ఆశ్రమంలో డజనుకు పైగా మహిళలపై లైంగిక వేధింపులు, మోసపూరిత కార్యకలాపాలు జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వయం ప్రకటిత బాబా చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథి కేసులో కొత్త షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Chaitanyananda: పోలీసులు స్వాధీనం చేసుకున్న అతని మొబైల్‌ ఫోన్‌లో అనేక సెన్సిటివ్‌ చాట్స్‌, ఫొటోలు బయటపడ్డాయి. వివిధ వాగ్దానాలతో మహిళలను ఆకర్షించడానికి ప్రయత్నించిన చాట్‌లతో పాటు, పలువురు మహిళా క్యాబిన్‌ సిబ్బందితో ఉన్న ఫొటోలు, అనేక మంది మహిళల సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ పిక్చర్స్‌ స్క్రీన్‌షాట్లు కూడా సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Whatsapp Divorce: ఏంట్రా మరి ఇలా ఉన్నారు.. వాట్సాప్‌లో విడాకులు ఏంట్రా..!

అతను ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లోని శ్రీ శారద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్‌కి మాజీ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలోనే మహిళా విద్యార్థులపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం, బలవంతంగా శారీరక సంబంధం పెట్టుకోవడం, మహిళా హాస్టల్‌లో రహస్య కెమెరాలు అమర్చడం వంటి ఘోర ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.

లైంగిక వేధింపుల కేసు నమోదు అయిన తర్వాత చైతన్యానంద వారాల తరబడి పోలీసులకు దొరక్కుండా పరారీలో ఉన్నాడు. 50 రోజుల తర్వాత ఆగ్రాలోని ఒక హోటల్‌లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. అయితే విచారణలో సహకరించకపోగా, అబద్ధాలతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడని విచారణాధికారులు తెలిపారు.

అలాగే అతని వద్ద నుంచి నకిలీ విజిటింగ్ కార్డులు, పాస్‌పోర్ట్‌ వంటి పత్రాలు బయటపడ్డాయి. వాటిలో అతను ఐక్యరాజ్యసమితి, బ్రిక్స్ రాయబారి అని తప్పుడు హోదాలు వాడుకున్నట్టు తేలింది.

ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లోని విద్యార్థులు అతనిపై ఫిర్యాదు చేసిన తర్వాతే ఈ కేసు బయటపడింది. ఒక పూర్వ విద్యార్థి యాజమాన్యానికి లేఖ రాయగా, వైమానిక దళ అధికారి నుంచి వచ్చిన ఇమెయిల్‌లోనూ అతను విద్యార్థులను బెదిరించడం, అసభ్యకరమైన మెసేజ్‌లు పంపడం వంటి విషయాలు బయటపడ్డాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *