Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ మూడో ఎలిమినేషన్ తర్వాత నాలుగో వారం కూడా గొడవలతోనే సాగుతోంది. నిన్నటి ఎపిసోడ్లో సంజన, తనూజ మధ్య జరిగిన కిచెన్ రచ్చలో కెప్టెన్ డీమాన్ పవన్‌పై సంజన మండిపడింది. “నీకు అమ్మాయిలే కనిపిస్తారు.. వాళ్లు అడిగితే నో చెప్పవ్” అంటూ పవన్‌పై ఫైర్ అయ్యింది.
Bigg Boss 9 Telugu: రెండోసారి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన పవన్, హౌస్‌లో క్రమశిక్షణ కోసం “దొంగతనం చేస్తే జైల్లో వేస్తా” అని ఓవరాక్షన్ చేయడంతో సంజన రెచ్చిపోయింది. ఇదే సమయంలో పోపు కావాలని తనూజను అడిగిన సంజనకు ఆమె అంగీకరించడంతో కిచెన్‌కి వెళ్లింది. అయితే పవన్ మాత్రం “బ్రేక్‌ఫాస్ట్ చేశాం కదా” అంటూ నో చెప్పాడు. దీనిపై సంజన ఆగ్రహంతో “తినేదానికి బిక్ష వేస్తున్నారా..?” అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: Bigg Boss 9: ఎలిమినేట్ అయిన సంజన.. ఒక్కొక్కరిపై రెచ్చిపోయి ఇచ్చిపడేసింది!
తరువాత పవన్ సంజనకు సారీ చెప్పినా ఆమె “రీతూ, దివ్య, తనూజ అడిగితే చేసేవాడివి.. నేను అడిగితేనే నో అంటావ్” అంటూ మరింత ఫైర్ అయ్యింది. ఈ మధ్య భరణి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా గొడవ తగ్గలేదు.
మరోవైపు ఈ వారం ఇమ్యూనిటీ కోసం బిగ్‌బాస్ కొత్త టాస్కులు ఇచ్చాడు. డీమాన్ పవన్ సంచాలక్‌గా 12 మందిని ఆరు టీములుగా విభజించారు. మొదటి రౌండ్ తర్వాత సుమన్ శెట్టి–దివ్య టీమ్ మిగిలి, రెండో రౌండ్లో తనూజ, ఫ్లోరాను ఎంపిక చేశారు. చివరకు సుమన్ శెట్టి, తనూజలు ఇమ్యూనిటీ సాధించి ఈ వారం నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు.
