Women’s World Cup 2025: సుమారు 12 ఏళ్ల తర్వాత మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ మళ్లీ భారతదేశానికి చేరుకుంది. 2013లో చివరిసారి భారత్ హోస్ట్ చేసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ, ఇప్పుడు శ్రీలంకతో కలిసి హైబ్రిడ్ మోడల్లో జరుగనుంది. ఇందులో ఎక్కువ మ్యాచ్‌లు భారత్‌లో జరగగా, ఫైనల్ మాత్రం శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా ఆడనున్నారు.
Women’s World Cup 2025: టోర్నమెంట్ షెడ్యూల్: ప్రారంభం: సెప్టెంబర్ 30, గువాహటి, ముగింపు: నవంబర్ 2, కొలంబో, పాల్గొనే జట్లు: భారత్, ఆస్ట్రేలియా (డిఫెండింగ్ ఛాంపియన్), ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్.
ఇది కూడా చదవండి: IND vs PAK: ఉందారా నీకు అసలు ట్రోఫీని దొబ్బేయడం ఏంట్రా!
మొదటి మ్యాచ్ నేడు గువాహటి వేదికగా భారత్ – శ్రీలంక మధ్య జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ పోరు టోర్నీకి స్టార్ట్ ఇస్తుంది.
భారత జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తోంది. ఈమె ఇప్పటివరకు నాలుగు వరల్డ్‌కప్‌లలో ఆడగా, ఇప్పుడు ఐదవసారి జట్టుకు మార్గనిర్దేశనం చేయనుంది. గత ఏడాదిలో నాలుగు వన్డేల్లో మూడు సెంచరీలు బాదిన హర్మన్‌ప్రీత్, ప్రత్యేకించి ఆస్ట్రేలియాపై వరుస సెంచరీలతో దూసుకెళ్లింది. ఆమెతో పాటు యువ ఓపెనర్ ప్రతీకా రావల్ దూకుడు జట్టుకు అదనపు బలం కల్పిస్తోంది.
INDW vs SLW: అంచనా ప్లేయింగ్ XI
భారత్:
ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ రాణా, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, రేణుకా సింగ్ ఠాకూర్
శ్రీలంక:
హాసిని పెరెరా, చమరి అతపత్తు (కెప్టెన్), హర్షిత సమరవిక్రమ, విష్మి గుణరత్నే, అనుష్క సంజీవని (WK), కవిషా దిల్హరి, దేవ్మీ విహంగ, పియుమి వత్సలా, అచ్చిని కులసూర్య, ఉదేశిక ప్రబోధని, మల్కీ మదర
