Rahul Gandhi: వర్షంలో తడుస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ

brs meeting

Rahul Gandhi: భారతదేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంది. రాజధాని ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పాల్గొన్నారు.

Rahul Gandhi: ఈ సందర్భంగా రాహుల్ గాంధీ భారీ వర్షంలో తడుస్తూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. గొడుగు లేకుండా నిలబడి పతాకాన్ని ఆవిష్కరించిన ఆయనను చూసి అక్కడి కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’లో పోస్టు చేస్తూ, “స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ద్వారా మనం పొందిన ఈ స్వేచ్ఛను న్యాయం, సత్యం, సమానత్వం, సోదరభావం మీద ఆధారపడి ఉన్న భారతదేశ నిర్మాణానికి అంకితం చేద్దాం” అని పిలుపునిచ్చారు. ఈ విలువైన వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

ప్రియాంక గాంధీ కూడా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. “లక్షలాది మంది వీరులు అనేక త్యాగాలు చేసి మనకు స్వేచ్ఛను అందించారు. ప్రజాస్వామ్యం, న్యాయం, సమానత్వం, పరస్పర ఐక్యత అనే జాతీయ సంకల్పాన్ని మనకు అందజేశారు. ఒక వ్యక్తి – ఒక ఓటు అనే సూత్రం ద్వారా మనం సంపన్నమైన ప్రజాస్వామ్యం పొందాము. మన స్వేచ్ఛ, రాజ్యాంగ సూత్రాలను రక్షించాలనే మా సంకల్పం దృఢమైనది” అని ఆమె పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *