Scam Alert: సైబర్ స్కామ్ల్లో రోజుకో కొత్త తరహా పద్ధతులు కనిపిస్తున్నాయి. తాజాగా “జ్యూస్ జాకింగ్” పేరిట కొత్త ఛార్జర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్లో హ్యాకర్లు పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్స్లోని కేబుల్స్ లేదా ఛార్జర్స్లో ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ అమర్చుతూ, మొబైల్ ఫోన్లలోని డేటాను దొంగిలిస్తున్నారు.
Scam Alert: జ్యూస్ జాకింగ్ అనేది మొబైల్ ఛార్జింగ్ పాయింట్ ద్వారా ఫోన్లలోని డేటా చోరీ చేసే సైబర్ మోసం. ముఖ్యంగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్లలో ప్రయాణికులు ఫోన్ ఛార్జ్ చేయడానికి కేబుల్స్ ఉపయోగిస్తారు. ఈ క్రమంలో హ్యాకర్లు మొబైల్లోని వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ డీటెయిల్స్, ఫొటోలు వంటి డేటాను సులభంగా దొంగిలించవచ్చు.
ఇది కూడా చదవండి: Viral News: రెండేళ్లుగా ఉన్నమసీదు పక్కనే కారు.. అందులో ఏమి జరుగుతుందో తెలిస్తే అయ్యో.. అంటారు !
ఎలా జాగ్రత్త పడాలి: పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లలో మీ సొంత కేబుల్ మరియు ఛార్జర్ మాత్రమే వాడండి. పవర్ బ్యాంక్లు ఉపయోగించడం మరింత సురక్షితంగా ఉంటుంది. ఫోన్లో అవసరమైతే USB సెక్యూరిటీ ఫీచర్ లేదా “చార్జ్-only” ఆప్షన్ను ఎంచుకోండి. డేటా చోరీ బారిన పడితే వెంటనే సైబర్ క్రైమ్ పోర్టల్ (cybercrime.gov.in) లో ఫిర్యాదు చేయండి.
నిపుణుల సూచనలు సైబర్ పోలీస్ అధికారులు చెబుతున్నారు, జ్యూస్ జాకింగ్ నుండి మోసాలు ఎక్కువవుతున్నాయి. ఈ స్కామ్లో పడిపోకుండా ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండి, ఎలాంటి సస్పిషియస్ USB లేదా ఛార్జర్ను ఉపయోగించరాదు.
