Annual Recharge Plans: ప్రతి నెలా మొబైల్ రీఛార్జ్ చేయడం చిరాకుగా అనిపిస్తుందా? అయితే యాన్యువల్ ప్లాన్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. 28 రోజుల, 21 రోజుల ప్లాన్స్‌తో పోలిస్తే యాన్యువల్ ప్లాన్స్‌లో లాభం ఎక్కువ. ఒక్కసారిగా రీఛార్జ్ చేస్తే ఏడాదంతా టెన్షన్ లేకుండా సౌకర్యంగా ఉపయోగించుకోవచ్చు.
Annual Recharge Plans: జియోలో రూ.3599 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. రోజుకు 2.5 జీబీ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, జియోటీవీ, హాట్‌స్టార్ సబ్స్క్రిప్షన్లు కూడా వస్తాయి. రూ.3999 ప్లాన్‌లో అయితే అదనంగా Jio Fan Code (స్పోర్ట్స్ ఓటీటీ) సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. జియో ఫోన్ యూజర్ల కోసం రూ.1234 ప్లాన్‌తో 336 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 0.5 జీబీ డేటా అందుతుంది. అలాగే రూ.895 ప్లాన్‌లో ప్రతి 28 రోజులకు 2 జీబీ డేటా లభిస్తుంది.
ఇది కూడా చదవండి: Tribal Woman: గిరిజన మహిళ అదృష్టం.. ఒకేసారి మూడు వజ్రాలతో పంట పండింది!
ఎయిర్‌టెల్‌లో రూ.3599 యాన్యువల్ ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, Airtel Xstream సబ్స్క్రిప్షన్ వస్తాయి. రూ.2249 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు మొత్తం 30 జీబీ డేటా (డైలీ డేటా లేదు) లభిస్తుంది.
Viలో రూ.3599 ప్లాన్‌తో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ వస్తాయి. అదనంగా రాత్రి 12 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఫ్రీ డేటా అందుతుంది. రూ.3799 ప్లాన్‌లో Amazon Prime Lite సబ్స్క్రిప్షన్, రోజుకి 1.5 జీబీ డేటా లభిస్తుంది. రూ.3499 ప్లాన్‌లో రోజుకి 1.5 జీబీ డేటా, రూ.1999 ప్లాన్‌లో ఏడాదికి 24 జీబీ డేటా (డైలీ డేటా లేదు) అందుతుంది.
బీఎస్ఎన్ఎల్లో రూ.2399 ప్లాన్‌తో 395 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 2 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. రూ.1999 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో పాటు 600 జీబీ డేటా వస్తుంది. రూ.1515 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీ, రోజుకి 2 జీబీ డేటా అందుతుంది.
మొత్తంగా చూసుకుంటే, నెల నెలా రీఛార్జ్ చేసుకోవడం కన్నా ఈ యాన్యువల్ ప్లాన్స్ వినియోగదారులకు ఎక్కువ సౌలభ్యం, అదనపు ప్రయోజనాలు అందిస్తున్నాయి.
