Bigg Boss 9 Telugu: సెప్టెంబర్ 7న గ్రాండ్గా స్టార్ట్ అయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 మొదటి రోజే ఘర్షణలకు వేదికైంది. నాగార్జున చెప్పినట్టే ఈసారి సెలబ్రెటీలు వర్సెస్ కామనర్స్ మధ్య రణరంగమే కనిపిస్తోంది. కంటెస్టెంట్స్ అందరికీ పనులు కేటాయించే దశలోనే ఇద్దరు కామనర్స్ మధ్య ఘర్షణ తలెత్తింది.
Bigg Boss 9 Telugu: ప్రొమోలో మొదట అందరూ ఎంజాయ్ చేస్తూ, డాన్స్ చేస్తూ కనిపించారు. ఇమ్మాన్యుయేల్ తన పంచులతో అందరినీ ఎంటర్టైన్ చేశాడు. కానీ అసలు డ్రామా అప్పుడే మొదలైంది.
పవన్ ఇచ్చిన బ్యాడ్జ్ ప్రకారం హౌస్ క్లీనింగ్ బాధ్యత రీతూ చౌదరికి దక్కింది. అప్పుడు ఆమె “స్టౌవ్ కూడా క్లీన్ చేయాలా?” అని అడగడంతో హరీష్ స్పందించాడు. “హౌస్ క్లీనింగ్ అంటే అన్నీ వస్తాయి.. కిచెన్ టేబుల్ కూడా అదే లో భాగం” అని అన్నాడు.
ఇది కూడా చదవండి: Raghava Lawrence: రాఘవ లారెన్స్ మనసు బంగారం – దివ్యాంగురాలి జీవితాన్ని మార్చేసిన ఉదారత
అక్కడినుంచే వివాదం ముదిరింది. కుకింగ్, క్లీనింగ్ ఎవరు చేయాలి అన్న అంశంపై రీతూ, ప్రియ, సంజనా పేర్లు చర్చలోకి వచ్చాయి. ఖాళీగా ఉన్న సంజనా క్లీనింగ్ చేస్తే బాగుంటుందని హరీష్ అన్నాడు.
మధ్యలో మనీష్ “అది సరైంది కాదు” అని చెప్పడంతో హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “నీకు బ్యాడ్జ్ రాలేదు కదా.. నువ్వు మాట్లాడొద్దు” అన్నాడు. దాంతో మనీష్ కూడా రెచ్చిపోయి వాగ్వాదం సాగించాడు. చివరకు హరీష్ “వెళ్లిపోవడానికైనా నేను రెడీ” అంటూ ఫైర్ అయ్యాడు.
మొదటి రోజే హౌస్మేట్స్ మధ్య ఈ స్థాయిలో గొడవలు జరగడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. నాగ్ చెప్పినట్టే కామనర్స్ వర్సెస్ సెలబ్రెటీలు రగడలు ఈ సీజన్లో పీక్కు వెళ్లేలా కనిపిస్తున్నాయి.
