IND vs PAK: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ పోరు ఈ నెల సెప్టెంబర్ 14న ఆసియా కప్ 2025లో జరగనుంది. అయితే, మ్యాచ్ను భారత్ బహిష్కరిస్తుందనే ఊహాగానాలు గట్టిగానే వినిపించాయి. దీనిపై తొలిసారిగా బీసీసీఐ (BCCI) స్పష్టతనిచ్చింది.
IND vs PAK: బీసీసీఐ కార్యదర్శి దేవ్ జీత్ సైకియా ఎన్డీటీవీతో మాట్లాడుతూ –“మేము కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాం. బహుళ-జట్ల టోర్నమెంట్లలో ఆడే విషయంలో క్రీడా శాఖ స్పష్టమైన సూచనలు ఇచ్చింది. క్రీడలకు సంబంధించిన నిర్ణయాలు జాగ్రత్తగా, ఆటగాళ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తీసుకోవాల్సినవే” అన్నారు.
ఇది కూడా చదవండి: MS Dhoni: వింటేజ్ రోల్స్ రాయిస్లో ధోనీ షికారు.. కారు వెనక పరుగులు తీసిన అభిమానులు.. వీడియో వైరల్!
బహిష్కరిస్తే ఎలాంటి పరిణామాలు?
సైకియా వివరించగా –
- భారత్ పాకిస్తాన్తో ఆడటానికి నిరాకరిస్తే, ACC లేదా ICC కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
- అత్యంత తీవ్రమైన పరిస్థితిలో, బీసీసీఐపై నిషేధం కూడా పడే ప్రమాదం ఉంది.
- ఇది యువ ఆటగాళ్ల కెరీర్పై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.
భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సిరీస్లు చాలా కాలంగా లేవు. దీని వెనుక రాజకీయ కారణాలున్నాయని సైకియా స్పష్టంచేశారు.
“భవిష్యత్తులో కూడా భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్లు జరగవు. కానీ ఆసియా కప్, వరల్డ్ కప్ వంటి బహుళ-జట్ల టోర్నమెంట్లలో మాత్రం తప్పనిసరిగా తలపడతాం” అని ఆయన అన్నారు.
