Telangana: తెలంగాణ దసరా సెలవుల లిస్ట్ వచ్చేసింది.. అబ్బో.. ఇన్ని రోజులా..?

Telangana: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ వచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ ఈ ఏడాది దసరా పండగకు సంబంధించిన అధికారిక సెలవుల జాబితాను ప్రకటించింది. బతుకమ్మ ఉత్సవాలు, దసరా పండుగ రెండూ కలిసి రావడంతో విద్యార్థులకు వరుసగా పెద్ద ఎత్తున సెలవులు లభించనున్నాయి.

పాఠశాలల సెలవులు

  • సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

  • అక్టోబర్ 4నుంచి సాధారణ తరగతులు పునప్రారంభం అవుతాయి.

ఇది కూడా చదవండి: Hyderabad: గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్‌ మృతి

జూనియర్ కళాశాలల సెలవులు

  • జూనియర్ కళాశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులు ఉంటాయి.

ఈమేరకు విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు, వేడుకలు లేదా ఇతర ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *