Viral: ఆడుకుంటూ రూ.10 కాయిన్ మింగిన బాలుడు.. డాక్టర్ చాకచక్యంతో 2 నిమిషాల్లో ప్రాణ రక్షణ

Viral: మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 10 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ పొరపాటున రూ.10 నాణెం మింగేశాడు. అది గొంతులో ఇరుక్కుపోవడంతో ఊపిరాడక ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది. అయితే జిల్లా ఆసుపత్రిలోని ఒక డాక్టర్‌ అత్యంత చాకచక్యంగా వ్యవహరించి కేవలం రెండు నిమిషాల్లో బాలుడి ప్రాణాలను కాపాడాడు.

Viral: ఛతర్పూర్ జిల్లాలోని పారా గ్రామానికి చెందిన గిర్ధారి పాల్ కుమారుడు నరేంద్ర పాల్, ఆటలాడుతుండగా రూ.10 నాణెం నోట్లో పెట్టుకున్నాడు. ఆ క్షణంలోనే అది గొంతులో ఇరుక్కుపోయింది. శ్వాస తీసుకోలేక పిల్లాడు తల్లడిల్లిపోయాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు అతన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Viral Video: నీటిలో ఏనుగు–మొసలి భీకర పోరాటం.. గెలుపు ఎవరిదంటే?

అక్కడే మనోజ్ చౌదరి అనే వైద్యుడు కేసును స్వీకరించారు. పిల్లల దగ్గర ఇలాంటి ఘటనలపై ఇంతకు ముందు అనుభవం ఉన్న ఆయన, సమయాన్ని వృథా చేయకుండా కేవలం రెండు నిమిషాల్లోనే నాణెం బయటకు తీశారు. వెంటనే బాలుడు ఊపిరి పీల్చుకొని సాధారణ స్థితికి చేరుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు.

నరేంద్ర ప్రాణాన్ని కాపాడినందుకు తల్లిదండ్రులు డాక్టర్ మనోజ్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంఘటన తల్లిదండ్రులకు మరోసారి హెచ్చరికలా నిలిచింది. చిన్న పిల్లల చుట్టూ నాణేలు, పిన్స్, చిన్న వస్తువులు ఉంచకూడదని, పిల్లల భద్రత కోసం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *