Toll Tax Free: వాహనదారులకు గుడ్‌న్యూస్.. టోల్‌ప్లాజాల్లో కార్లు, బస్సులకు టోల్‌ ఫ్రీ!

Toll Tax Free: మహారాష్ట్ర ప్రభుత్వం వాహనదారులకు పెద్ద శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లు, ఈ-బస్సులను టోల్ టాక్స్‌ నుండి మినహాయించింది. అంటే ఇకపై ఈవీ కార్లు, ప్రభుత్వ రవాణా ఎలక్ట్రిక్ బస్సులు ఎక్కడైనా టోల్ ప్లాజాల్లో ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ కొత్త నిబంధన ఆగస్టు 22 నుంచి అమల్లోకి వచ్చింది.

Toll Tax Free: ఈ టోల్ ఫ్రీ స్కీమ్ అటల్ సేతు, పూణే ఎక్స్‌ప్రెస్‌వే, సమృద్ధి మహామార్గ్‌లాంటి ప్రధాన మార్గాల్లోనూ వర్తిస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలోని అన్ని హైవేలు, రహదారులపై కూడా ఈవీ వాహనాలకు టోల్ మినహాయింపుని విస్తరించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది.

మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం పర్యావరణ పరిరక్షణలో భాగమే. ప్రైవేట్ వాహనాలు, ప్రభుత్వ వాహనాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే, ఎలక్ట్రిక్ సరుకు రవాణా వాహనాలకు మాత్రం ఈ మినహాయింపు వర్తించదు.

కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద, హైవేలలో మరియు నగరాల్లో ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. పెట్రోల్ బంకులు, ఎస్టీ బస్సు డిపోలు, స్టాండ్‌ల వద్ద కూడా కనీసం 4-5 ఛార్జింగ్ పాయింట్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

రాష్ట్రంలో కొత్తగా రిజిస్టర్ అయ్యే వాహనాల్లో కనీసం 30% వాహనాలు ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు 40%, కార్లు మరియు SUVలకు 30%, ఓలా, ఉబర్ వంటి క్యాబ్ సర్వీసులకు 50%, ప్రైవేట్ బస్సులకు 15% లక్ష్యం నిర్ణయించింది.

ఈ నిర్ణయంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతోపాటు, పెట్రోల్–డీజిల్‌పై ఆధారపడటం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *